లగడపాటిపై ఎన్నారైల నిరసన దీక్ష

లండన్‌: తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టిన సందర్భంగా సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు, ముఖ్యంగా లగడపాటి రాజగోపాల్, వేణు గోపాల్ రెడ్డి పాల్పడిన చర్యలకు నిరసనగా తెలంగాణ ఎన్నారై ఫోరం, తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నారై విభాగం సంయుక్తంగా సెంట్రల్ లండన్ లోని బారత హై కమిషన్ కార్యాలయం దగ్గర ఉన్న నెహ్రు విగ్రహం వద్ద శాంతియుత నిరసన దీక్ష చేపట్టాయి.

పార్లమెంటులోని సంఘటన ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదని అంటూ భారత ప్రభుత్వం వెంటనే వీళ్ళని కఠినంగా శిక్షించాలని, ఇంకెప్పుడు కూడ వీరు ప్రజా జీవితంలో తిరగకుండా బహిష్కరించాలని తెలంగాణ ఎన్నారైలు కోరారు. వీరికి శిక్ష పడాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్రపతికి, ప్రధాన మంత్రికి, హోం మంత్రికి, లోకసభ స్పీకర్ కి రాసిన పిటీషన్లను హై కమిషనర్ అధికారికి సమర్పించారు.

Telangana NRIs protest against Lagadapati act

అలాగే, తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వచ్చిన సందర్భంగా, ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని రాజాకీయ పార్టీలు మద్దతు తెలపాలని, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం అయిన బిజెపి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఆమోదింపచేయాలనీ కోరారు.

ఈ కార్యక్రమంలో ఎన్నారై టిఆర్ఎస్ సెల్ అద్యక్షుడు, తెలంగాణ ఎన్నారై ఫోరం వ్యవస్థాపక సభ్యుడు అనిల్ కూర్మాచలంతో పాటు ప్రమోద్ అంతటి, సిక్క చందు గౌడ్, అశోక్ గౌడ్, గోలి తిరుపతి, నగేష్ రెడ్డి, మల్లా రెడ్డి, చోటు, నవీన్ రెడ్డి,సుధాకర్, కిరణ్, శశి, రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+