కేసీఆర్ ఆమరణ దీక్షతోనే రాష్ట్ర ఆవిర్భావం: ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ బహ్రెయిన్ సెల్
కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైంది. తమ చిరకాల కల నెరవేరిందని ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ బహ్రెయిన్ సెల్ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు వెంకటేష్ బొలిశెట్టి అన్నారు. దీక్షా దివస్ చరిత్రను మలుపు తిప్పినరోజు అని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చావు నోట్లో తల పెట్టి 'తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో' ఆమరణ నిరాహార దీక్ష ఇవాళ్టికి 13 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా వారు బహ్రెయిన్‌లో మీడియాతో మాట్లాడారు.

దీక్ష ఉద్యమాన్ని గొప్ప మలుపు తిప్పిందని, చరిత్ర గతినే మార్చి వేసిందని వారు అన్నారు. అప్పటిదాకా నడుస్తోన్న శాంతియుత ఉద్యమానికి, సత్యాగ్రహ ఆయుధంలా మారిందన్నారు. తెలంగాణ ప్రజలని ఏకం చేసి, ఆనాటి కేంద్ర ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టించిందని తెలిపారు. ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను ప్రజ్వలింపజేసిన రోజు అని వివరించారు.

కేసీఆర్ మొక్కవోని దీక్షతో తెలంగాణ రాష్ట్ర సాధనకు అంకురార్పణ చేసిన రోజు అని పేర్కొన్నారు. ఆమరణ దీక్షనే అస్త్రంగా, కేసీఆర్ త్యాగమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని వివరించారు. అదే ఉద్యమ స్ఫూర్తితో.. బంగారు తెలంగాణ డెవలప్ చేస్తున్నారని వెల్లడించారు. ప్రపంచంలో ఎక్కడా లేని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు.

కార్యక్రమంలో ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు వెంకటేష్ బొలిశెట్టి, ప్రధాన కార్యదర్శి మగ్గిడి రాజేందర్, అన్నారం సుమన్, కార్యదర్శులు చెన్నమనేని రాజేందర్, సంగేపోలు దేవన్న, ఉత్కం కిరణ్ గౌడ్, కొత్తూరు సాయన్న, గరిగె సతీష్ గౌడ్, తోకల లింగం, ఇతర నాయుకులు పాల్గొన్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications