NRI News: ఇంగ్లాండ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి మృతి..!
ఇంగ్లాండ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. తూర్పు ఇంగ్లండ్‌లోని లీసెస్టర్‌షైర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత విద్యార్థి 32 ఏళ్ల పంగులూరి చిరంజీవి చనిపోయాడు. చిరంజీవి ప్రయాణిస్తున్న కారు కాలువలో పడిపోవడంతో నీటిలో మునిగిపోయాడు. రక్షించే ప్రయత్నం చేయగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు తెలిసిందే. కాలువలో పడి కారులో నలుగురు ఉన్నారు. వీరిలో ముగ్గురు పురుషులు కాగా.. ఒక మహిళ ఉన్నారు. వీరిని ఆసుపత్రికి తరలించినట్లు లీసెస్టర్‌షైర్ పోలీసులు తెలిపారు.
మహిళాతో సహా ముగ్గురు ప్రాణాలతో బయట పడగా.. చిరంజీవి మాత్రం చనిపోయాడు. వారంతా యాష్ కలర్ మాజ్డా 3 తమురాలో ప్రయాణిస్తున్నారని లీసెస్టర్‌షైర్ పోలీసులు తెలిపారు. లీసెస్టర్ నుంచి మార్కెట్ హార్బరో వైపు కౌంటీకి వెళుతున్నప్పుడు అదుపు తప్పిన కారు కాలువలో పడినట్లు పేర్కొన్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. లీసెస్టర్‌కు చెందిన పంగులూరి సంఘటనా స్థలంలో మరణించినట్లు పోలీసులు ప్రకటించారు.

ఆస్పత్రిలో ఉన్నవారంతా క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. కారులో ప్రయాణించిన నలుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారిగా గుర్తించారు. పోలీసులు కారులను సీజ్ చేశారు. ప్రమాదానికి ముందు కారు డాష్ బోర్డు కెమెరాలో ఏదైనా క్యాప్చర్ చేసిందా లేదా అని తనిఖీ చేయనున్నారు. చిరంజీవి మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా కొద్ది రోజుల క్రితం కెనడాలో భారత విద్యార్థి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన కూడా స్థానికంగా కలకలం సృష్టించింది.












Click it and Unblock the Notifications