వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీకన్నా ముందంజలో టీడీపీ

|
Google Oneindia TeluguNews

NRI...నాన్ రెసిడెంట్ ఇండియన్. ఎక్కువగా మనకు ఎన్నారై అనగానే అమెరికాలో ఉండేవారే గుర్తుకొస్తారు. కొందరైతే అమెరికాలో నివసించేవారినే ఎన్నారైలుగా భావిస్తారు కాబోలు అనేంతగా ఆ దేశ జీవన విధానం గాఢమైన ముద్ర వేసింది. రూపాయితో పోలిస్తే అమెరికా డాలరు కన్నా ఎక్కువ ఉండే యూరో కరెన్సీ, అరబ్ దేశాలకు చెందిన దీనార్ కానీ.. ఇలా చాలానే ఉన్నాయి. కానీ అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ లాంటి పాశ్చాత్య దేశాల్లో నివసించేవారు ఖరీదైన ఎన్నారైలు అనే అభిప్రాయం ఉంది.

రాజకీయాలపై ఆసక్తి

రాజకీయాలపై ఆసక్తి


మాతృభూమికి దూరంగా ఉండటంవల్ల సహజంగానే సొంత ఊరు, సొంత నేలపై ఎక్కువ అభిమానం చూపిస్తుంటారు. అక్కడ సంపాదించుకున్న డబ్బులతో ఇక్కడ ఏదైనా సేవా కార్యక్రమాలు చేయాలని తలపోస్తుంటారు. వీరిలో కొందరు సేవా కార్యక్రమాలు చేస్తూనే రాజకీయాలపై ఆసక్తి చూపిస్తుంటారు. కానీ రెండు దేశాల్లో పౌరసత్వం ఉండటంతో రాజకీయ పార్టీలు టికెట్ పై హామీ ఇస్తే అక్కడి పౌరసత్వం వదులుకొని దేశానికి రావడానికి ఆసక్తి చూపించేవారు మరికొందరున్నారు.

ఆర్థిక బలం.. అంగబలం రెండూ ఉంటాయి..

ఆర్థిక బలం.. అంగబలం రెండూ ఉంటాయి..


ఎన్నారైల దగ్గర ప్రధానంగా ఉండేది ఆర్థిక బలం. ఆర్థికంగా బలంగా ఉంటే మనుషులంతా చుట్టూ చేరతారు కాబట్టి సహజంగా అంగబలం చేకూరుతుంది. ఏపీ రాజకీయాలకు సంబంధించి పలువురు ఎన్నారైలు ఇప్పటివరకు తెరవెనక పాత్ర పోషించేవారు. తమకునచ్చిన రాజకీయ పార్టీలకు ఆర్థికంగా సహాయం చేస్తుండటం, విదేశాల్లో విరాళాలు సేకరించడం, సాంకేతిక సహాయంలాంటివి అందిస్తుంటాయి. అయితే పలువురు ఎన్నారైలు ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాలని నిర్ణయించుకున్నారు.

 తెర ముందుకు ఎన్నారైలు

తెర ముందుకు ఎన్నారైలు


రానున్న ఎన్నికలు వైసీపీకి, టీడీపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో పలువురు ఎన్నారైలు కూడా తెరవెనక కన్నా తెరముందే తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ విషయంలో అధికారంలో ఉన్న వైసీపీకన్నా టీడీపీయే బలంగా ఉంది. మొత్తం 175 నియోజకవర్గాలకు ప్రస్తుతం 14 మంది ఎన్నారైలు టీడీపీ తరఫున సీట్లు ఆశిస్తున్నారు. వైసీపీ తరఫున నలుగురు టికెట్లు ఆశిస్తున్నారు. జనసేన నుంచి కూడా ప్రయత్నాలు సాగుతున్నాయికానీ ఎంతమంది అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఇదే జరిగితే ఎన్నారైలు నేరుగా రాజకీయాల్లోకి దిగి ఢీకొట్టడం ఇదే మొదటిసారి అవుతుంది. పార్టీ అధినేతలెవరూ ఇంతవరకు ఎవరికీ స్పష్టతివ్వలేదు. ఏదేమైనప్పటికీ టీడీపీ, వైసీపీకే కాకుండా ఎన్నారైలకు కూడా 2024 ఏపీ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమవబోతున్నాయని అర్థమవుతోంది.

English summary
Financial strength was the main thing for NRIs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X