NRI News: ఇజ్రాయెల్‌లో పని చేయడానికి లక్ష మంది భారతీయులు కావాలట..!
అక్టోబరు 7న ఇజ్రాయెల్(Israel)లో హమాస్(hamas) దాడి తర్వాత యుద్ధం ప్రారంభమైంది. దీంతో ఇజ్రాయెల్ లో పని చేస్తున్న 90,000 మంది పాలస్తీనియన్ల స్థానంలో 1 లక్ష మంది భారతీయ కార్మికులను నియమించుకోవడానికి కంపెనీలను అనుమతించాలని ఇజ్రాయెల్ నిర్మాణ పరిశ్రమ ప్రభుత్వాన్ని కోరింది. "ప్రస్తుతం భారత్‌తో చర్చలు జరుపుతున్నాం. దానిని ఆమోదించడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం నిర్ణయం కోసం మేము ఎదురుచూస్తున్నాము. భారత్ నుంచి 50,000 నుంచి 1,00,000 మంది కార్మికులను తీసుకోవాలని బావిస్తున్నాం. ఇది మొత్తం రంగాన్ని నడపడానికి, సాధారణ స్థితికి తీసుకురావడానికి వీలు కల్పిస్తుంది" అని ఇజ్రాయెల్ బిల్డర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ హైమ్ ఫీగ్లిన్ చెప్పినట్లు వెస్ట్ బ్యాంక్ నుంచి వాయిస్ ఆఫ్ అమెరికా నివేదిక పేర్కొంది.
ఈ నివేదికపై భారత విదేశాంగ మంత్రి వెంటనే స్పందించలేదు. నివేదిక ప్రకారం ఇజ్రాయెల్ నిర్మాణ పరిశ్రమలో పనిచేస్తున్న శ్రామికశక్తిలో పాలస్తీనియన్లు దాదాపు 25 శాతం ఉన్నారు. "మేము యుద్ధంలో ఉన్నాము. ఈ రంగంలో మా మానవ వనరులలో 25 శాతం ఉన్న పాలస్తీనా కార్మికులు రావడం లేదు. ఇజ్రాయెల్‌లో పని చేయడానికి అనుమతించబడలేదు" అని ఫీగ్లిన్ చెప్పారు. పాలస్తీనా కార్మికులలో దాదాపు 10 శాతం మంది గాజాకు చెందినవారు. ప్రస్తుతం గాజా సంఘర్షణకు కేంద్రంగా ఉందని పేర్కొన్నారు.

మేలో, ఇజ్రాయెల్ భారత్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం 42,000 మంది భారతీయులు ఇజ్రాయెల్‌లో పని చేయడానికి వీలు కల్పిస్తుంది. ముఖ్యంగా నర్సింగ్‌తో పాటు నిర్మాణ రంగంలో భారతీయులను తీసుకోవచ్చు. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి హిబ్రూ పత్రికా ప్రకటన ప్రకారం, "నిర్మాణ, నర్సింగ్ రంగాలలో 42,000 మంది భారతీయ కార్మికుల రాకను అనుమతించడానికి మంత్రులు కూడా ఒప్పందాలపై సంతకం చేశారు.
ఇజ్రాయెల్‌లోని నిర్దిష్ట లేబర్ మార్కెట్ రంగాలలో కార్మికుల తాత్కాలిక ఉపాధిని సులభతరం చేయడంపై ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం మే 9న ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఎలి కోహెన్ భారతదేశ పర్యటన సందర్భంగా ప్రారంభించారు. అక్టోబరు 7న దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని ప్రారంభించినప్పటి నుంచి ఇజ్రాయెలీ క్రాసింగ్ మూసివేశారు. కాలినడకన క్రాసింగ్ దాటుతున్న కార్మికులపై ఇజ్రాయెల్ అధికారులు హింసాత్మకంగా ప్రవర్తించారని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్ కాల్పుల విరమణ దిశగా వెళ్తోన్నట్లు కనిపిస్తోంది.
-
మా ఫింగర్స్ ట్రిగ్గర్ పైనే ఉన్నాయి.. ఏ క్షణమైనా : ఇరాన్ సంచలన వార్నింగ్ -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది












Click it and Unblock the Notifications