దుబాయ్‌లో వాసవీ యూత్ వనభోజనాలు
అబుదాబి: దుబాయ్ వాసవి యూత్ ఎన్నారై ఆధ్వర్యంలో శుక్రవారం(నవంబర్ 13న) క్రీక్ పార్క్ గేట్ నెంబర్-4లో కార్తీకమాస వన భోజనాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ టీవీయాంకర్ మృధుల వ్యాఖ్యతగా వ్యవహరించారు.
యూఏఈ దుబాయ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి 750మందికి పైగా ఆర్య వైశ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిధులకు వాసవి యూత్ ఎన్నారై వారు పలు ఆసక్తికరమైన ఆటలతో పాటు, ఫేస్ పైయింటింగ్, గోరింటాకు, బెలూన్ మేకింగ్, మ్యాజిక్ షో, మహిళలకు ప్రత్యేకంగా ‘లక్ష్మి రావామ్మా మా ఇంటికి' వంటి కార్యక్రమాలతో గోల్డ్ కాయిన్స్ అందజేశారు.
అంతేగాకాకుండా నోరూరించే తెలుగు వంటకాలతో విందు భోజనం, ప్రత్యేకంగా ఉలవచారు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇండియా, దుబాయ్, గల్ఫ్, ఒమన్‌లో ఆర్యవైశ్య పెద్దలు ఎంఎన్ఆర్ గుప్తా, శ్రీధర్ బేల్డి, కట్ట ప్రసాద్, విజయ్ బొజ్జ, సురేష్, అనురాధ ఓబుల్ శెట్టి, యాలమర్తి శరత్, వాసవి యూత్ ఎన్నారై కార్యవర్గం అత్యంత ఘనంగా సన్మానించారు.

వాసవి యూత్ ఎన్నారై పలు సేవలతో ఆర్థికంగా వెనుకబడిన ఆర్యవైశ్య విద్యార్థులను చదివించడం అభినందనీయమని అని సంస్థ ప్రతినిధులైన జూలూరు వెంకట సురేష్ కుమార్, రఘురాం సందీప్ దిగ్గవల్లి, ఎంఎన్‌వి శ్రావణ్, సుజన, సంతోషి, శరవణ్‌ని అభినందించారు. ఈ సంస్థ రానున్న 4,5 సంవత్సరాలలో గల్ఫ్ కౌంట్రీలో తన కార్యకలాపాలను విస్తరించాలని కోరారు.
ఈ కార్యక్రమం కార్యవర్గ సభ్యులైన రఘురాం సందీప్, జూలూరు సురేష్‌లు విచ్చేసిన అతిధులకు, స్పాన్సర్లకు కృతజ్ఞతలు తెలియచేస్తూ, రానున్న కాలంలో మరిన్ని కార్యక్రమాలు, సేవలు చేస్తామని తెలియచేశారు. జూలూరు హారిక, అవినాష్, దీపు, రాజేష్, నాగార్జున, అనిల్ మాజేటి, ప్రసన్న, చరణ్, జగన్, శ్రవేష్, వసుధ, సత్య ప్రవీణ్, సమీర, సాయీష్, ప్రవీణ్, నవీన్, లీలకృష్ణలు కార్యక్రమానికి సహాయ సహకారాలు అందచేశారు.












Click it and Unblock the Notifications