యువతిపై మరో నలుగురితో బాయ్‌ఫ్రెండ్ అత్యాచారం

Boyfriend ditches girl
చెన్నై: ఓ యువతిపై బాయ్‌ఫ్రెండ్ మరో నలుగురితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. 19 ఏళ్ల యువతికి వారు డ్రింకులో మత్తు కలిపి ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో యువకుడి కోసం గాలిస్తున్నారు. అరెస్టయినవారిలో తమిళనాడులోని అనకాపుతూరుకు చెందిన యువతి బాయ్‌ఫ్రెండ్ కె. శివానంద (19) ఉన్నాడు. శివానంద చెన్నైలోని ఓ ప్రైవేట్ కాలేజీలో హోటల్ మేనేజ్‌మెంట్ మొదటి సంవత్సరం చదవుతున్నాడు. యువతిని అతను ఆదివారం తన మిత్రుల ఇంటికి తీసుకొని వెళ్లాడు. మిత్రులతో కలిసి అతను ఆమెపై అత్యాచారం చేసి, సోమవారం ఉదయం ఆమెను ఇంటి వద్ద వదిలేశాడు.

ఆ యువతి సేల్స్ గర్ల్‌గా పనిచేస్తోంది. సంఘటన వల్ల తీవ్రంగా గాయపడిన ఆ యువతిని ఎగ్మోర్‌లోని ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స చేస్తున్న సమయంలో ఆమెపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు గుర్తించారు. పోలీసులకు సమాచారాన్ని అందించారు. వైద్యుల సమక్షంలో పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అరెస్టయినవారిలో ఇంజనీరింగ్ విద్యార్థి సంతోష్ (19), పాలిటెక్నిక్ విద్యార్థి హరిహరన్ (19), బిటెక్ మొదటి సంవత్సరం విద్యార్థి దీపన్ కుమార్ (18) ఉన్నారు. నవీన్ (19) అనే యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+