మిత్రులతో కలిసి భార్యపై సామూహిక అత్యాచారం?

Khammam Map
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తన భర్త మిత్రులతో కలిసి తమపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు భార్య ఆరోపిస్తోంది. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. రంగారావు, నాగమణి అనే దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే భార్య కొన్నాళ్లుగా భర్త రంగారావుకు దూరంగా ఉంటోంది. ఇటీవల అతను భార్య వద్దకు వెళ్లి కలిసుందామని చెప్పి తన ఇంటికి తీసుకుని వచ్చాడు.

భార్యకు వేరేవారితో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో పరీక్షల నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆస్పత్రి కాంపౌండర్లు ముగ్గురితో కలిసి భర్త తనకు మత్తు మందు ఇచ్చి, తనపై అత్యాచారానికి పాల్పడినట్లు నాగమణి మీడియాకు చెప్పుకుంది. తనను వివస్త్రను చేసి ఫొటోలు కూడా తీశారని ఆమె ఆరోపిస్తోంది.

అయితే, భర్త రంగారావు వాదన మరో విధంగా ఉంది. ఆరోగ్యం బాగా లేకపోవడం వల్లనే తాను తన భార్యను ఆస్పత్రికి తీసుకుని వచ్చానని, అత్యాచారం వంటిదేదీ జరగలేదని అతను అంటున్నాడు. అయితే, ఆత్యాచారం జరిగినట్లు తమకు ఫిర్యాదు ఏదీ అందలేదని పోలీసులు చెబుతున్నారు. భార్యాభర్తలకు సంబంధించిన గొడవపైనే తమకు ఫిర్యాదు అందిందని చెబుతున్నారు.

రంగారావును అదుపులోకి తీసుకుని పోలీసులు చెబుతున్నారు. నాగమణిపై అత్యాచారం జరిగిందా, లేదా అనే విషయం వైద్య పరీక్షలు చేస్తేనే తేలుతుందని అంటున్నారు. తనపై అత్యాచారం చేశారని చెబుతున్న ముగ్గురిలో ఒకరి పేరు నాగమణి చెబుతోంది. తనకు మత్తు మందు ఇవ్వడం వల్ల మిగతా వారిని గుర్తించలేకపోయినట్లు ఆమె అంటోంది. ఈ సంఘటన వారం రోజుల క్రితం జరిగినప్పటికీ నాగమణి శుక్రవారం మీడియా ముందుకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+