విశాఖ జిల్లాలో యువతి రేప్, హత్య: కీచక టీచర్ పరారీ

Women Rape
హైదరాబాద్: విశాఖపట్నం జిల్లాలోని పర్యాటక ప్రాంతం అరకులో దారుణం జరిగింది. అరకు మండలం తురాయిగూడ సమీపంలోని వజ్రాల కొండ దగ్గర ఓ యువతి నగ్న మృతదేహం లభ్యమైంది. మహిళపై అత్యాచారం చేసి ఆమెను ఆ తర్వాత హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. యువతిని గుర్తుపట్టకుండా దుండగులు ఆమె ముఖాన్ని కాల్చేశారు.

సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల క్రితమే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

హైదరాబాద్ నగరంలో మరో కీచక టీచర్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. జీడిమెట్లలోని శాంతినికేతన్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థినుల పట్ల ఓ ఉపాధ్యాడు అసభ్యంగా ప్రవర్తించాడు. భయాందోళనకు గురైన ఐదుగురు విద్యార్థినులు పాఠశాలను మానేశారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. పాఠశాల ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. టీచర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

కృష్ణా జిల్లాలో ముగ్గురి ఆత్మహత్య

కృష్ణా జిల్లాలోని వత్సవాయి మండలం భీమవరంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది.

మేరుగు తులసమ్మ (75), ఆమె కుమారుడు పిచ్చిరెడ్డి (50), అతని మేనత్త రాజమ్మ (90) ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. మహిళలు ఇద్దరు కూడా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. పిచ్చిరెడ్డి ఆరు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది సోమవారం రాత్రి పురుగుల మందు సేవించి ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు.

ట్రాక్టర్ ఢీకొని విద్యార్థి మృతి

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని ఆగ్రహారం గ్రామంలో పాఠశాలకు వెళ్తున్న విద్యార్థిని వెనక నుంచి వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో గ్రామానికి చెందిన పట్టవు రాజ్ కుమార్ (13) అనే విద్యార్థి అక్కడికక్కడే మరణించాడు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో అతను ఆరో తరగతి చదువుతున్నాడు. విషయం తెలుసుకున్న బంధువులు, స్థానికులు ఆందోళనకు దిగారు. రాస్తారోకో నిర్వహించారు.

రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి

నెల్లూరు జిల్లాలోని సంగం కొండ మలుపు దగ్గర మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొనడంతో పక్కనే ఉన్న గుంటలోకి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
Are You Over 18?
By entering the site, you agree to our terms and conditions