వివాహిత రేప్: నాలుగు నెలలు బాలికపై అత్యాచారం

ఎక్కడైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాధితురాలు భయంతో గ్రామంలోకి చేరుకుంది. అదే దారిన నిందితుడు వస్తుండగా అనుమానంతో గ్రామస్థులు అతడిని చెట్టుకు కట్టేసి పోలీసులు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని విచారించారు. అధిక రక్తస్రావంతో బాధపడుతున్న బాధితురాలిని చికిత్స నిమిత్తం కావలి ఏరియా అసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యచికిత్స కోసం నెల్లూరు జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.
మాయమాటలతో బాలికను లోబరుచుకుని నాలుగునెలల పాటు అత్యాచారానికి పాల్పడిన కీచకుడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. గర్భం దాల్చిన బాలిక జరిగిన సంఘటన గురించి ఇంట్లో చెప్పడంతో అసలు విషయం వెలుగుచూసింది. అనంతపురం జిల్లా గోరంట్ల పంచాయతీ గుమ్మయ్యగారిపల్లిలో ఈ సంఘటన జరిగింది.
సంఘటన వివరాలు పోలీసుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి - గుమ్మయ్యగారిపల్లికి చెందిన కురుబ ఈశ్వరయ్య(45) అదే గ్రామానికి చెందిన బాలిక(15)ను బలవంతంగా లోబరుచుకున్నాడు. గత నాలుగు నెలలుగా బాలికపై అత్యాచారం చేస్తున్నాడు. బాలిక ఆరోగ్యం క్షీణించడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు వైద్యుడికి చూపించగా గర్భం దాల్చినట్లు నిర్ధారించారు.
దీంతో తల్లిదండ్రులు బాలికను నిలదీయడంతో అసలు విషయం బయటపెట్టింది. ఈ మేరకు బాధితురాలి తల్లిదండ్రులు గోరంట్ల పోలీసులకు ఫిర్యాదుచేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications