బాలికపై రేప్: శీలానికి రూ. 20 వేలు ధర కట్టిన పెద్దలు

సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి - సాయంత్రం వేళలో పొరుగూరు నుంచి కాలినడకన ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో అకస్మాత్తుగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వచ్చింది. దీంతో సమీపంలో అవ్వ, తాతల తలదాచుకునే ప్రయత్నం చేసింది. అదే సమయంలో ఆ దారిన వెళ్తున్న ఇద్దరు యువకుల్ని గమనించి తమ మనువరాల్ని గ్రామానికి క్షేమంగా తీసుకెళ్లాలని కోరారు.
అలా తీసుకువస్తున్న బాలికపై కొంత దూరం వెళ్లిన తరువాత ఆ ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. అనంతరం ఏడుస్తూ ఇంటికి చేరిన ఆ బాలిక తల్లిదండ్రులకు విషయం తెలిపింది. అయితే ఈ విషయం గ్రామం అంతా తెలియడంతో ఊరి పెద్దలు ఆ యువకుల కుటుంబం నుంచి పాతిక వేల రూపాయలు వసూలు చేసి బాలిక కుటుంబానికి అప్పగించేందుకు చర్చలు సాగించారు.
అయితే దీన్ని వ్యతిరేకిస్తూ బాలిక కుటుంబం మంగళవారం ఉదయం పోలీసుల్ని ఆశ్రయించింది. మర్రిపాడు స్టేషన్‌లో కూడా తొలుత పోలీసు అధికారులు సర్దుబాటు చేసుకోవాలంటూ మంతనాలు సాగించి విఫలమయ్యారు. అనంతరం బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం నెల్లూరులోని ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications