మంచానికి కట్టేసి అమ్మాయిపై పెంపుడు తండ్రి రేప్

వివరాలు ఇలా ఉన్నాయి - నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం లింగంపల్లి ఏసినగర్‌కు చెందిన ఓ వివాహిత భర్తతో తెగతెంపులు చేసుకుని జీవిస్తూ ఉండేది. ఆమెకు రెండేళ్ల కూతురు ఉండేది. ఈ స్థితిలో ఆమెకు పట్టణానికి చెందిన మస్తాన్ అనే ముస్లిం వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆమె తన పేరు అఫ్రీన్‌గా మార్చుకుని అతడితో సహజీవనం చేయసాగింది. ఈ క్రమంలో ఓ ఏడాది తరువాత ఆమె అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో రెండేళ్ల బిడ్డను మస్తాన్ చెన్నైలోని ఫ్రీన్ బంధువుల ఇంట్లో చేర్చాడు.
మస్తాన్ మరో పెళ్లి చేసుకుని విఘ్నేశ్వరపురం కాలనీలో నివాసముంటున్నాడు. ఈ పరిస్థితుల్లో బాలికకు యుక్తవయస్సు వచ్చాక ఆమెను తానే పోషిస్తానని చెప్పి తెచ్చి గూడూరులో తన తల్లి ఇంటివద్ద ఉంచి పెంచసాగాడు. ఆరునెలల కిందట మస్తాన్ తల్లి వద్దకు వెళ్లి ఆ బాలికను పొదలకూరుకు తెచ్చి వేరొక ఇల్లు అద్దెకు తీసి అందులో ఉంచాడు. నెల్లాళ్లుగా తన కోర్కె తీర్చమని ఆమెను వేధించసాగాడు. ఆమె అంగీకరించకపోవడంతో హింసించసాగాడు. గోలచేస్తే పరువుపోతుందని ఆమె చుట్టుపక్కల వారికి ఏదో సర్దిచెప్పి నెల్లాళ్లుగా నెట్టుకొస్తోంది.
అయితే, పట్టువదలని అతను ఈనెల 22న రాత్రి బాలికను మంచానికి కట్టి అరవకుండా నోట్లో దుస్తులు కుక్కి పైశాచికంగా అత్యాచారం జరిపాడు. చెప్తే చంపేస్తానని బెదిరించాడు. ఆ భయంతో దిగులుగా ఉన్న బాలికను చుట్టుపక్కల వారు ఆరా తీయగా మస్తాన్ అకృత్యాన్ని వివరించింది. పొదుపు సంఘ మహిళ సాయంతో బాధితురాలు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదు చేసిన మూడు గంటల్లోనే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications