ప్రేయుడిని బెదిరించి పోలీసునని చెప్పి యువతిపై రేప్

బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి - సూళ్లూరుపేట మండల పరిధిలోని జంగాలగుంట గ్రామానికి చెందిన యువతి సూళ్లూరుపేట పట్టణంలో ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది. ఈమెకు కాళహస్తికి చెందిన శ్రీనివాసులుతో పరిచయం ఉంది. వీరిరువురు కలసి శనివారం చెంగాళమ్మ గుడి వెనుక భాగాన కాళంగినది ఒడ్డున సరదాగా కాలక్షేపం చేస్తుండగా, ఇదే సమయంలో దొరవారిసత్రం మండలం కారికాడు గ్రామానికి చెందిన వేనాటి రాజశేఖరరెడ్డి మద్యం సేవించి తన అనుచరులతో కలసి అక్కడకు చేరుకున్నాడు.
ప్రేమికులను చూసి మిగిలిన వారు వెళ్లిపోయారు. మద్యం మత్తులో ఉన్న రాజశేఖరరెడ్డి ప్రియుడ్ని బెదిరించి యువతిపై అత్యాచారం చేశాడు. అనంతరం వీరిరువురు కలసి ఆలయ సమీపంలోని జిఎన్‌టి రోడ్డుపై వస్తుండగా, గస్తీలో ఉన్న పోలీసులు వారిని విచారించి స్టేషన్‌కు తీసుకొచ్చారు.
ఆదివారం ఆ యువతిని పోలీసులు విచారించగా, తన ప్రియుడ్ని బెదిరించి తనపై ఒకడు అత్యాచారం చేసినట్లు పోలీసులకు చెప్పడంతో పోలీసులు గాలించి రాజశేఖరరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications