ఇద్దరు అమ్మాయిలపై మూడు నెలలుగా అత్యాచారం
విశాఖపట్నం: రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో దారుణమైన సంఘటన వెలుగు చూసింది. ఇంటి పక్కనే ఉంటున్న ఇద్దరు మైనర్ బాలికలను బెదిరించి మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్న ఇంజనీరింగ్ పట్టభద్రుడి ఉదంతం మంగళవారం వెలుగులోకి వచ్చింది.
న్యూపోర్టు పోలీసుల వివరాల ప్రకారం- పెదగంట్యాడ మండల పరిధి ప్రియదర్శినీ కాలనీలో ముగ్గురు కూతుళ్లతో కలిసి ఒక మహిళ నివాసం ఉంటోంది. ఆమె భర్త ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. వారి ఇంటి పక్కనే దూరపు బంధువు, బిటెక్ చదివిన రమేష్ ఉంటున్నాడు. ముగ్గురు ఆడపిల్లల్లో 13, 10 ఏళ్ల గల ఇద్దరు అమ్మాయిలను తల్లి ఇంట్లో లేని సమయంలో మూడు నెలల క్రితం బెదిరించి రమేష్ అత్యాచారం చేశాడు. అప్పటి నుండి ఈ దారుణాన్ని కొనసాగిస్తున్నాడు.

ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో వారు తల్లికి చెప్పలేదు. మంగళవారం కూడా అతడు పిల్లలు ఉంటున్న ఇంటికి వచ్చాడు. పిల్లలు ఏడుస్తూ మూడు నెలలుగా తమపై జరుగుతున్న అఘాయిత్యాన్ని తల్లికి చెప్పారు.
ఆమె రమేష్‌ను నిలదీయగా సమాధానం చెప్పలేదు. కుటుంబ సభ్యుల సహకారంతో ఆమె న్యూపోర్టు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాజేష్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సిఐ శ్రీనివాసరావు తెలిపారు.












Click it and Unblock the Notifications