రూ.100తో దాతృత్వ విప్లవం:'KindIndia.in'ప్రారంభం,NGOలు-దాతలు ఇక ఒకే వేదికపై..!!
Kind India సంస్థ తన కొత్త ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ KindIndia.in ను ప్రారంభించింది. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వెరిఫైడ్ ఎన్జీఓలు, దాతలను ఒకే వేదికపైకి తీసుకువస్తూ, భారతీయ సమాజంలో అతిముఖ్యమైన దయ, దాతృత్వ విలువలను తిరిగి ప్రోత్సహించడమే లక్ష్యంగా రూపొందించబడింది.
కేవలం ₹100 నుండి మొదలయ్యే విరాళాలతో, ఈ ప్లాట్‌ఫారమ్ "100 రూపాయల చారిటీ రెవల్యూషన్" అనే కొత్త ఉద్యమానికి నాంది పలుకుతోంది. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, ఆలయాలు, విద్యాసంస్థలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు వంటి విభిన్న రంగాలకు చెందిన ఎన్జీఓలను ఏకతాటిపైకి తీసుకువస్తూ కైండ్ ఇండియా చారిటీని అందరి దైనందిన జీవితంలో భాగంచేయాలనే సదుద్దేశాన్ని పెట్టుకుంది.

"మనం ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్స్ లో ఎంత ఉత్సాహంగా పాల్గొంటామో, అంతే ఉత్సాహంతో అవసరమైనవారి గురించి కూడా ఆలోచించాలని మేము కోరుకుంటున్నాం," అని కైండ్ ఇండియా ప్రతినిధి తెలిపారు. "పుట్టినరోజులు, వార్షికోత్సవాలు, పండుగలు - వేడుక ఏదైనా, మీరు చేసే చిన్న సహాయం మీ సంతోషాన్ని రెట్టింపు చేసుకునే అవకాశంగా మార్చుకోవాలి" అని అన్నారు.
దేశవ్యాప్తంగా సోషల్ మీడియా ప్రచారాలు నిర్వహించడం ద్వారా ఇలాంటి కార్యక్రమాలు కొందరినైనా ఉత్తేజితం చేసి మరికొంతమందిని ఈ మార్గంలో నడిపిస్తుంది. మీ ఈ చిన్న పని ద్వారా మీరు ఆనందం పొందడంతోపాటు ఒకరి సంతోషానికి,మరొకరి మొహం మీద చిరునవ్వుకు కూడా కారణం కాగలరు.
దాతృత్వం అనేది కేవలం డబ్బు గురించే కాదు - అది పంచుకోవడం, పరస్పర సహాయ సహకారాలను అందించుకోవడం ద్వారా సమాజంపై సానుకూల ప్రభావం సృష్టించడం గురించినది. భారతీయ సమాజం చారిత్రాత్మకంగా ఈ గుణాలకు పెట్టింది పేరు. కర్ణుడు ("దాన కర్ణుడు") నుండి బలి చక్రవర్తి వరకు, మన సంస్కృతి దాతృత్వంతో నిండిపోయి ఉంది. సమాజంలో ఈ గుణాలను తట్టిలేపి దేశాన్ని ఈ దశలోనే ప్రయాణింపజేయాలని కైండ్ ఇండియా తపిస్తోంది. .
Kind India గురించి
కైండ్‌నెస్ ను సామజిక అలవాటుగా మార్చాలనే లక్ష్యంతో KindIndia.in ఏర్పడింది. దాతలను, ఎన్జీఓలను ఒకేతాటిపైకి తీసుకొచ్చి సమాజంలో కైండ్‌నెస్ ను ప్రోత్సహించే వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ, ఈ ఫౌండేషన్ చారిటీని మన జీవన విధానంగా మార్చిలని సంకల్పిస్తుంది












Click it and Unblock the Notifications