ఆత్మహత్య నివారణోపాయాలపై చర్చించే బుక్

సెప్టెంబర్ 10న ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం, అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ఈ రెండూ ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తోన్నాయి. ప్రజారోగ్యంలో పలు సవాళ్లు విసురుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండింట్లో ఒక సమస్యను అయినా ఖచ్చితంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం నెలకొంది. దీనిపై తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉందనడంలో సందేహాలు అక్కర్లేదు.

ఈ నేపథ్యంలో- హోమ్‌ కమింగ్: మెంటల్ హెల్త్ జర్నీ ఆఫ్ రెసైలియన్స్, హీలింగ్ అండ్ హోల్నెస్ అనే బుక్.. ప్రజలకు అందుబాటులోకి రానుంది. నేహా కిర్పాల్, డాక్టర్ నందిని మురళి రచించిన పుస్తకం ఇది. వెస్ట్‌ల్యాండ్ బుక్స్ దీన్ని విడుదల చేయనుంది. మానసిక ఆరోగ్యానికి సంబంధించి ప్రత్యక్ష అనుభవాలను సేకరించి రాసిన బుక్ ఇది. వారి అంతరంగాన్ని యధాతథంగా ఆవిష్కరించింది.

Homecoming by Neha Kirpal and Dr Nandini Murali Chronicles of Strength in Indian Women s Mental Health

మానసిక ఆరోగ్య సమస్యలను అర్థం చేసుకోవడం, దాన్ని నివారించండానికి తీసుకునే విధానాల్లో సమూల మార్పులను ఇందులో చర్చించారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరుల్లో త్వరలో ఈ బుక్ ను ఆవిష్కృతం కానుంది. మార్కెట్ లో అందుబాటులోకి రానుంది. మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళా నాయకుల జీవన శైలిని సైతం ఇందులో పొందుపరిచారు.. నేహా కిర్సాల్, డాక్టర్ నందిని మురళి. దేశంలో మానసిక ఆరోగ్య సంక్షోభాన్ని పరిష్కరించడానికి వారు చేసిన మంచి ప్రయత్నంగా చెప్పుకోవచ్చు.

దేశంలో 300 మిలియన్ల మంది పెద్దలు, 50 మిలియన్ల మంది పిల్లలు మానసిక ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఈ పుస్తకం మానసిక ఆరోగ్యం పట్ల ఉన్న అపోహలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇలాంటి ఓ పుస్తకం అందుబాటులోకి రావడం దేశంలో ఇదే తొలిసారి. డిప్రెషన్, స్కిజోఫ్రీనియా, దీర్ఘకాలిక మానసిక ఆందోళన, ఓసీడీ, బైపోలార్ డిజార్డర్, ఆత్మహత్య చేసుకోవాలనుకునే ఆలోచనలు వంటి తీవ్రమైన మానసిక ఆరోగ్య పరిస్థితులతో జీవిస్తున్న మహిళా నాయకుల వాస్తవ అనుభవాలను ఇందులో రాశారు రచయిత్రులు.

ఇలాంటి తీవ్రమైన మానసిక ఆందోళనను ఎలా నయం చేయవచ్చు?, అందుకు అనుసరించాల్సిన చికిత్స, ఆరగ్య సంరక్షణ వంటి విధానాలను స్పష్టంగా పొందుపరిచారు. దేశంలో మానసిక ఆరోగ్య సంరక్షణ ఎంతవరకు విచ్ఛిన్నమైనదే విషయాన్ని కూడా ఈ బుక్ లో రాశారు.

Homecoming by Neha Kirpal and Dr Nandini Murali Chronicles of Strength in Indian Women s Mental Health

అమహా హెల్త్, చిల్డ్రన్ ఫస్ట్, ఇండియా మెంటల్ హెల్త్ అలయన్స్ (IMHA) వ్యవస్థాపకురాలు నేహా కిర్పాల్. లెర్నింగ్ అండ్ రీసెర్చ్ అట్ అవతార్ ఉపాధ్యక్షురాలు, SPEAK వ్యవస్థాపకురాలిలా సేవలను అందిస్తోన్నారు డాక్టర్ నందిని మురళి. వృత్తిపరంగా తమకు ఎదురైన అనుభవాలు, సేకరించిన అభిప్రాయాలకు ఈ పుస్తకం ద్వారా అక్షర రూపాన్ని ఇచ్చారు.

మొత్తం 11 మంది మహిళా నాయకుల అనుభవాలు ఇందులో ఉన్నాయి. వారిలో వ్యాపారవేత్తలు, మానసిక ఆరోగ్య నిపుణులు, ఎల్జీబీటీక్యూఐ+ కార్యకర్తలు, మానసిక వైద్య బోధన రంగంలో ఉన్న టీచర్లు ఉన్నారు.

నేహా కిర్పాల్ మాట్లాడుతూ.. స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్న తల్లిదండ్రులకు జీవితాంతం సంరక్షకురాలిగా ఉన్న వారి జీవిత అనుభవాలు, ఇటువంటి సంరక్షణ పొందేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తులు, దేశంలో మానసిక ఆరోగ్య సంరక్షణ పద్ధతులు, వ్యవస్థలను నిర్మించే వారికి ఈ పుస్తకం ఎంతో సహాయపడుతుందని నేహా కిర్పాల్ అన్నారు. తమ భావాలు, ఆవేదన, అనుభవాలను పంచుకోవడం ద్వారా సంరక్షణ పొందాలనుకునే వారికి, దేశంలో మానసిక ఆరోగ్య పద్ధతులు, వ్యవస్థలను నిర్మించే వారికి ఈ బుక్ ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు.

హోమ్‌కమింగ్ సహ రచయిత్రి, లెఫ్ట్ బిహైండ్: సర్వైవింగ్ సూసైడ్ లాస్ రచయిత్రి డాక్టర్ నందిని మురళి మాట్లాడుతూ.. మహిళలు తరచుగా సంరక్షణ, అణచివేత వంటి అనుభవాలను చవి చూస్తుంటారని, మానసిక ఆరోగ్యంపై బహిరంగంగా చర్చించే విషయంలో వారిని పరిగణనలోకి తీసుకోవట్లేదని అన్నారు. దీనికి భిన్నంగా.. మానసిక ఆరోగ్యాన్ని కేంద్రబిందువుగా చేసుకుని ఈ బుక్ ను రచించినట్లు చెప్పారు.

Homecoming by Neha Kirpal and Dr Nandini Murali Chronicles of Strength in Indian Women s Mental Health

ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న డిప్రెషన్, వ్యసనం, ఆత్మహత్యల్లో మూడింట ఒక వంతు భారత్ లోనివే. 300 మిలియన్ల మంది పెద్దలు, 50 మిలియన్ల మంది పిల్లలు వారి జీవితకాలంలో మానసిక ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్నారు. దీనిపై బహిరంగంగా చర్చించే విషయంలో కొన్ని అపోహలు ఎదురవుతున్నాయి. ఫలితంగా వారు సకాలంలో సహాయాన్ని అందుకోలేకపోతున్నారు. ఇది 95 శాతం వరకు చికిత్సా అంతరాన్ని పెంచుతుంది.

హోమ్‌కమింగ్ ఈ పరిస్థితిని అధిగమించింది. అందుబాటులో నాణ్యమైన సంరక్షణ, ఇళ్లు, కళాశాలలు, కార్యాలయాలు, సహాయక కేంద్రాల వంటి వ్యవస్థల్లో మానసిక ఆరోగ్యంపై చర్చించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుందీ బుక్.

పుస్తక రచయితల్లో డాక్టర్ పూర్ణిమా విశ్వనాథన్, జైనాబ్ పటేల్, డాక్టర్ కవితా అరోరా, సిద్రా నైయ్యర్, డాక్టర్ రైసా ఆర్.ఎం, కైరవి భారత్ రామ్, డాక్టర్ ఫెరోజా జే. గోద్రేజ్, జననీ అయ్యర్, అపర్ణా పిరమాల్ రాజ్ ఉన్నారు.

పుస్తకావిష్కరణ కార్యక్రమాలు:

ఢిల్లీ: సెప్టెంబర్ 29, ఇండియా హాబిటాట్ సెంటర్.

ముంబై: అక్టోబర్ 10

బెంగళూరు: నవంబర్ 7, బెంగళూరు ఇంటర్నేషనల్ సెంటర్.

తాజా సమాచారం కోసం, హోమ్‌కమింగ్‌ను ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లను ఫాలో కావొచ్చు. మరింత సమాచారం, ఇంటర్వ్యూలు, ప్రశ్నల కోసం మో'స్ ఆర్ట్ ([email protected] | +91 85277 93252), వెస్ట్‌ల్యాండ్ బుక్స్ ([email protected] | +91 88266 03355) సంప్రదించండి.

నేహా కిర్సాల్ ఒక సృజనాత్మక, సామాజిక వ్యాపారవేత్త. ఆమె ఇండియా ఆర్ట్ ఫెయిర్ (2008-2018)ను స్థాపించారు. ఆ తర్వాత మానసిక ఆరోగ్య సంరక్షణపై పూర్తిగా దృష్టి సారించారు. స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్న తల్లికి సంరక్షకురాలిగా, తోబుట్టువు ఆత్మహత్యను ఎదుర్కొన్న తర్వాత ఆమె పొందిన అనుభవాల స్ఫూర్తితో, 2019లో ఆమె అమహాను సహ-స్థాపించారు.

దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ మానసిక ఆరోగ్య సేవను అందించే సంస్థగా ఎదిగింది అమహా. 200 మందికి పైగా చికిత్సా నిపుణులు, మానసిక వైద్యులు దీని కింద సేవలను అందిస్తోన్నారు. ఆన్ లైన్ ద్వారా 600 నగరాలు, ఢిల్లీ, ముంబై, బెంగళూరుల్లో ఎనిమిది కేంద్రాల ద్వారా సంరక్షణను అందిస్తున్నారు. అమహా ఇటీవల తన మొదటి ప్రత్యేక మానసిక ఆరోగ్య ఆసుపత్రిని కూడా ప్రారంభించింది. అమహా, చిల్డ్రన్ ఫస్ట్‌తో కలిసి కుటుంబాలకు జీవితాంతం సేవ చేయడానికి, పాఠశాలలు, సమాజాలు, యువత మానసిక ఆరోగ్య కార్యక్రమాలకు మద్దతు ఇచ్చింది.

నేహా 2023లో స్థాపించబడిన ఇండియా మెంటల్ హెల్త్ అలయన్స్ (IMHA) వ్యవస్థాపక సభ్యురాలు. ఇది దేశవ్యాప్తంగా మానసిక ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడానికి కృషి చేస్తోంది. ఆమె హోమ్‌ కమింగ్ బుక్ సహ-రచయిత్రి కూడా. నేహా ఆస్పెన్ ఫెలో, ఐసెన్‌ హోవర్ ఫెలోగా గుర్తింపు పొందారు. NDTV's ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, బిజినెస్ టుడేస్ మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ అవార్డు, భారత రాష్ట్రపతి అందించిన నారీ శక్తి అవార్డును అందుకున్నారు.

డాక్టర్ నందిని మురళి.. లింగ వివక్ష- మానసిక ఆరోగ్య రంగానికి చెందిన న్యాయవాది. అపోహలను తొలగించడానికి, ఆత్మహత్యల ఆలోచనల నివారణ నిపుణురాలిగా ఉన్నారు. తన భర్త ఆత్మహత్య తర్వాత, ఆమె SPEAKను స్థాపించారు. హెల్ప్‌ లైన్ SPEAK2US ను కూడా ప్రారంభించారు. PROJECT SPEAKను కూడా రూపొందించారు. ఇది ఆత్మహత్య కారణంగా తమ వారిని కోల్పోయిన 600 మందికి పైగా మహిళలకు సహాయపడే రూరల్ పోస్ట్‌వెన్షన్ ప్రోగ్రామ్.

సర్టిఫైడ్ లైఫ్ కోచ్. స్టడీస్‌లో పీహెచ్‌డీ, జెండర్ అండ్ డెవలప్‌మెంట్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా పూర్తి చేశారు. "లెఫ్ట్ బిహైండ్: సర్వైవింగ్ సూసైడ్ లాస్" సహా అనేక పుస్తకాలను రాశారు. దేశంలో మానసిక ఆరోగ్యం వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి ఆమె కథనం, కోచింగ్, న్యాయవాదాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చారు.

వెస్ట్‌ల్యాండ్ బుక్స్ అవార్డు గెలుచుకున్న భారతీయ ప్రచురణకర్త. దీనికి కాంటెక్స్ట్, వెస్ట్‌ల్యాండ్ స్పోర్ట్, వెస్ట్‌ల్యాండ్ బిజినెస్, వెస్ట్‌ల్యాండ్ నాన్-ఫిక్షన్, రెడ్ పాండా, ఇండీ ప్రెస్, ఐఎఫ్, క్యూడీ (క్వియర్ డైరెక్షన్స్) వంటి పుస్తకాలను ముద్రించింది. ఇవి ఫిక్షన్, నాన్-ఫిక్షన్, ఛైల్డ్ లిటరేచర్, LGBTQIA+.. రంగానికి చెందిన రచనలను ప్రచురిస్తుంది.

ఇండియా మెంటల్ హెల్త్ అలయన్స్ (IMHA).. విద్య, ఆరోగ్య సంరక్షణ, లింగం, జీవనోపాధి వంటి వివిధ రంగాలలో పనిచేస్తున్న 220కి పైగా సంస్థలతో కూడిన ఓ సంస్థ. 2023లో వాస్వి, ఆశిష్ భారత్ రామ్ అమహా, చిల్డ్రన్ ఫస్ట్‌తో కలిసి IMHAను స్థాపించారు. ఇది భారత్ లో సహకార మానసిక ఆరోగ్య పర్యావరణ వ్యవస్థ నిర్మాణంలో పని చేస్తోంది. మానసిక ఆరోగ్య నిపుణులు, సంస్థలు, వ్యవస్థల కోసం ప్రత్యక్ష అనుభవ నైపుణ్యంపై దృష్టి సారించి శిక్షణ కార్యక్రమాలను అందిస్తుంది.

స్థాపించిన మొదటి సంవత్సరంలో 2,000 మందికి పైగా ఆయా రంగానికి చెందిన నిపుణులు దీని ద్వారా తమ సేవలను అందిస్తోన్నారు. IMHA మొదటి వార్షిక సమావేశం ఈ నెలలో న్యూఢిల్లీలో జరుగుతుంది. వృత్తిపరమైన కౌన్సిలింగ్ సేవల కోసం ఐకాల్ (iCALL) మెంటల్ హెల్ప్‌లైన్ నంబర్: 9152987821. సోమవారం - శనివారం: ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు ఫోన్ చేయవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+