• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

'తానా'కథలు- మరో కోణం

By Staff
|

ఈ మాట పత్రికలో 'తానా' బహుమతి పొందిన కథలు చూశాక నా నిరుత్సాహాన్ని ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేకుండా చేశారు కె.వి. గిరధర్‌ రావుగారు బహుమతి పొందిన కథలతో పాటు గిరిధర్‌రావుగారి వ్యాసం చదువవచ్చు). అయినా సరే దాన్ని కప్పేసుకుంటూ ఒకటి రెండు మాటలు చెప్తాను. అసలు అన్నిటి కన్నా ఉత్తమ కథకు ఉండాల్సిన లక్షణాలు వీటిలో దేనికి లేవని తేల్చేశారు న్యాయనిర్ణేతలు. వారు ఆ రకంగా తేల్చేశాక అంతనకన్నా అవమానం వేరే అక్కర్లేదు. కాబట్టి వీటిలో మంచి లక్షణాలేమైనా వెతకడం మంచిదేమో అనిపించి, ఈ కింది విషయం రాయడం జరిగింది.

చలివేంద్రం కథ ఒక అనామకుడి జీవితాన్ని అవిష్కరించడంలో కృతకృత్యమైంది. దీన్ని చదివి అయ్యో అనుకోవడం కన్నా ఇలాంటివి సమకాలీన సమాజంలో అతి మామూలు అనేట్టు చేసిన వ్యవస్థకు ఇదొక ప్రశ్నగా చూడడం మంచిది. రచయిత ఒక రకమైన 'దయచేసి జాలి చూపారు' అంటూ వేసే వెర్రికేక ఇందులో ఉందేమో! చదివే వాళ్లు కూడా ఒక రకమైన పాత్ర పోషణ చేస్తారనేది రచయితకు అర్థమయ్యే ఉండాలి. ఆ ఇల్లు మూతపడ్డది కథలో అసలు ముఖ్య పాత్రల కన్నా చుట్టూ ఉన్న జనం పాత్ర చూడమంటాను నేను. ఏదో వింత చూస్తున్నట్టు చూసే వాళ్లు కొందరయితే తలో మాట అనడానికి, సులువుగా ఉచితంగా దొరికే ఆనందాన్ని పంచుకోవడానికి, ముఖ్యంగా నేలకు రాలిపోతున్న చుక్కను చూడ్డానికి గుమికూడే ప్రజల మీద ఒక పెద్ద ఐందేమిటంటూ. సేటు ఆకారంలో బలవంతుడైన కాకపోయినా జనం బలం ఒక్కసారి మొరాలిటీని స్థానభ్రంశం చేస్తుందని వేరే చెప్పక్కర్లేదు. తక్కెడ తారుమారవుతుంది అప్పుడప్పుడు, ఎల్లప్పుడూ- ఈ జనం పక్కవాడి ఆత్మాభిమానాన్ని వేరే వాడు తొక్కేస్తుంటే చూడ్డానికి విరగబడ్డంత వరకు.

అతడు- నేను కథ సేవాతత్పరత కన్నా ముఖ్యంగా ఒక డ్యూటీని, ఎదుటివాడిని మోటివ్స్‌ ఏవైనా సరే తాను నిబద్దతతో చేసే పోరాటానికి ఒక నిర్వచనంగా ఉండిపోతుంది. తాను చేసే పనిని ఎలా సమర్థించుకోవడం అనేది ఆలోచనలోకి వచ్చినా చేసే పని మీద వున్న గౌరవం ఒక మోరల్‌ స్టాండర్డును సూచిస్తుంది. ఈ కథ చివరలో అందరూ చెప్పినట్టు ఏవో అర్థం లేని, అనవసర సమర్థనలు, వాదాలు మాటల్లో చూపకుండా క్లుప్తంగా తన పనిని ప్రతిబింబింప చేస్తూ ముగించి ఉంటే ఉత్తమ కథగా మిగిలేది (అవార్డు వచ్చినా, రాకపోయినా). మిగతా కథలకు ఈ కథకు ఉన్న తేడా అదే.

హాలాహలం కథ కొంతవరకు నిజ పరిస్థితులకు దగ్గరలో ఉందేమో అనిపించింది. ఇందాక చెప్పినట్టు మనం ఇలాంటి విషయాల గురించి ఎంతవరకు ఇమ్యూన్‌ అయ్యామో తెలియాలంటే చావు దగ్గర కూడా తమ సొంత బాధ్యతను విస్మరించి, హైటెక్‌ సిటీ ఎఫెక్ట్‌ మీద విరుచుకుపడే మనుషుల (సొంత అన్నదమ్ములవే) నిజరూపాలను, అశక్తతను, అర్థం లేని భావాల్లో కూరుకుపోయిన మనస్తత్వాలను ప్రతిబింబింపజేసే ప్రయత్నంగా ఈ కథను చూడమంటున్నాను నేను. ఈ కథ ప్రత్యేకత దేన్నయితే చీదరించుకోవడం జరుగుతుందో కతలో మతాలపరంగా అదే మతాల పరంగా అదే విషయాన్ని బలపరచడం జరుగుతుంది స్థూలంగా సూచించడం అవకాశాలు చూస్తే.

మిత్తవ కథలో ఆవిడ పోరాటాన్ని అర్థం చేసుకోగలిగినా మిగతా వ్యక్తులు ఇచ్చే సహకారం పెద్ద గుండు సున్నా. మాట సాయం దూరపు వాళ్లయినా కాస్తో కూస్తో (బాగున్నావా అని అడగడం వరకే) చేయగలిగితే ఇంట్లో వాళ్లు అదీలేదు! అందుకే ప్రధాన పాత్రతో ఉండే ఒక అబ్సెషన్‌ వదిలేసి మిగతా వాతావరణం చూడమంటున్నాను నేను. ఈ కథలో ముగింపు గోవిందమ్మ చావు గురించి కాదు, తాను చనిపోయిందని తెలిసి తండోపతండాలుగా వచ్చి చూసే జనం గురించే.

నందిని కత మిగతా వాటిలా కాకుండా నందిని గురించే కావచ్చు, అయినా ఈ వ్యాసంలో పై తరహాలోనే (కథలో మిగతా పాత్రల గురించి అనే కోణం) చూడ్డం భయం కాబట్టి- లేకపోతే నా జడ్జిమెంట్‌ గాడి తప్పుతుందేమోనని- ఆవిడ పెళ్లి చూసుకోవడమే తమ జీవన పరమావధిగా భావంచే చుట్టూ ఉన్న వాళ్లది నిజంగా ఆవిడ మంచి కోరేనా లేక తమ పని అయిపోయిందనే సంతృప్తి, బాధ్యత తీర్చుకోవడం అనే సమాజంలో ఉండే చచ్చు విధానాల మీద ఒక విమర్శగా ఈ కథను చూడొచ్చేమో!

ఇదే దారిలో ఇంకొంత ముందుకెళ్తే న్యాయ నిర్ణేతలు కూడా తమ పని నిర్వహించడంలో పూర్తిగా సఫలీకృతులు కాలేదేమో అనిపిస్తుంది. కథల ప్రమాణాలను పెంచడం, తగ్గించడం ఒక అవార్డు వల్ల కానిపని. ఉన్న వాటిలో ఉత్తమ కథను వెతికి సపోర్టు చేయడం వాళ్ల కనీస బాధ్యత. అది సమకాలీన కథే కానీయండి, చట్టుబండే కానీయండి- పాఠకులు అదేదో బహుమతి వచ్చేసినందు వల్ల ఇదే ప్రమాణమని, లేక మిగతా రాతగాళ్లు ఇదే గొప్ప కథ అని భ్రమ పడే అవకాశం లేదు. ముఖ్యంగా చదివే వాళ్ల సొంత బుర్రల మీద కొంతైనా నమ్మకం ఉంటే. బహుమతి వల్లే కథలు బయటకు వస్తే ఆ బహుమతి సార్థకమైనట్లే. అవేలాంటి కథలైనా సరే. మనుషుల మీద నాకున్న నమ్మకమేమంటే- మంచిదో చెడ్డదో తెలుసుకోవడం చాలా మందికి చేతనవును అని (ఏవి మంచి కథలో చెప్పడానికి కథకులే అవ్వాల్సిన పనిలేదు- మంచీచెడులు తెలిసిన వారెవరయినా కావచ్చు)

ఈ కథల నిడివి గురించి ఒక చివరి మాట. నేనయితే ఐదు పేజీల తర్వాత కొన్ని వాక్యాలు స్కిప్‌ చేస్తాను, పది పేజీల తర్వాత కొన్ని పేరాలే చదవను- పదిహేను పేజీలు దాటితే (అది నా వల్ల కాకపోతే, పైగా అంతా పోటి నిబంధనల్లో చెప్పినటువంటి వాడుక భౄష కాక, అంతగా ప్రచారంలో లేని మాండలికమైతే) కొన్ని పేజీలు ఎగరగొట్టేసి, సీదా చివరి లైనుకు వెళ్లిపోతాను. మీరెవరైనా ( ముఖ్యంగా న్యాయనిర్ణేతలు) ప్రతి పదం, లైను, పేరా, పేజీ చదువుంటే మీకో అవార్డు ఇవ్వాల్సిందే. నేనెలాగు మంచిని మాత్రమే చూడమని చెప్తున్నాను. ఈ వ్యాసంలో కాబట్టి ఇక్కడ కూడా మన రచయితలు ఎలాగు చదివేవాళ్లు అన్నీ స్కిప్‌ చేస్తూ చదివేస్తారు అని తెలిసి చెప్పడమే మళ్లీ మళ్లీ చెప్తే ఏదో కొంతయినా బుర్రకెక్కుతుందేమోనని పెద్ద ప్లానుతో రాశారేమో మరి, అనుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more