వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హర్ ఏక్ మాల్, పాన్ డబ్బా: కవి అలీ మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

నల్లగొండ: నల్లగొండకు చెందిన ప్రముఖకవి మహ్మద్‌ అనీఫ్‌(అలీ) సోమవారం కన్నుముశారు. ఆయన వయసు 60 ఏళ్లు. నిరుపేద కుటుంబంలో మహ్మద్‌ గౌస్‌, జానీబేగం దంపతులకు 1956లో జన్మించిన అనీఫ్‌ డిగ్రీ చేసినా ఉద్యోగం దొరక్క పాన్‌డబ్బా పెట్టుకుని జీవనం సాగించారు.

అలీగా అందరికీ పరిచయస్థుడైన అనీఫ్‌ 'జీవితమే సాహిత్యం' అనే కలం పేరిట 1996లో సాహిత్య రంగంలోకి ప్రవేశించారు. 'పాన్‌మరక' అనే కవితలో తాను అనుభవించిన దుర్భర జీవితాన్ని ప్రస్తావించారు. ఆ తర్వాత ఉర్దూలో ఒక కథా సంపుటిని ప్రచురించారు. 2006లో ఉద్యమం సమయంలో 'సింహగర్జన' పేరుతో కవిత్వం రాశారు.

అలీ మృతికి కవులు అంబటి వెంకన్న, పున్న అంజయ్య, మేరెడ్డి యాదగిరిరెడ్డి, కొలనుపాక మురళీధర్‌రావు, అభిమానులు సంతాపాన్ని ప్రకటించారు.

Poet, short story writer Ali dies

నాలుగ్గీర‌ల బండీ మీద హ‌రేక్‌మాల్ అమ్మీ, ఆ జీవితాన్నే క‌థ‌లుగా, క‌విత‌లుగా మ‌లిచాడు. ఓ వైపు బతుకు పోరాటం చేస్తూనే, పిల్ల‌ల పెళ్లిల్లు చేసిన తర్వాత ఉస్మానియా యూనివ‌ర్సిటీ ఇస్లామిక్ స్ట‌డీస్‌లో ఎంఏ జాయిన్ అయ్యాడు. పిహెచ్‌డి చేయాలనేది ఆయన తీరని కోరిక.

పేరుకు ముందు డాక్ట‌ర్‌తోటే చ‌నిపోవాల‌న్న త‌న కోరిక నెర‌వేర‌క‌ముందే అసువులు బాసిన అలీభాయ్ అకాల‌మ‌ర‌ణం తెలంగాణ సాహితీ లోకానికి తీర‌ని లోటు అని ప్రముఖ కవి పసునూరి రవీందర్ అన్నారు.

English summary
A poet and short story writer of Nalgonda district in telangana Ali passed away.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X