Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

BSNL యూజర్లకు గుడ్‌న్యూస్‌. అందుబాటులోకి కొత్త సర్వీసులు

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కొత్త సంవత్సరం సందర్భంగా తన వినియోగదారులకు శుభవార్త అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అదిరిపోయే ఫిచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చేసంది. దీని ద్వారా నెట్వర్క్ లేని ప్రాంతంలో కూడా కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు.

దేశవ్యాప్తంగా అన్ని టెలికాం సర్కిల్స్‌లో VoWiFi (Voice over WiFi) సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు బీఎస్ఎన్ఎల్ అధికారికంగా ప్రకటించింది. ఈ సేవను సాధారణంగా వైఫై కాలింగ్ ఫీచర్గా పిలుస్తారు. ఈ కొత్త ఫీచర్ ద్వారా మొబైల్ నెట్‌వర్క్ కవరేజ్ సక్రమంగా లేని ప్రాంతాల్లోనూ, కేవలం వైఫై కనెక్షన్ ఉంటే చాలు BSNL యూజర్లు కాల్స్ చేయవచ్చు. అంతేకాదు, వాయిస్ కాల్స్‌తో పాటు SMS మెసేజ్‌లను కూడా పంపే అవకాశం ఉందని సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో నివసించే వినియోగదారులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.

థర్డ్ పార్టీ యాప్స్ డౌన్‌లోడ్?

ఈ VoWiFi సేవను IMS (IP Multimedia Subsystem) ఆధారిత ఆధునిక ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేసినట్లు BSNL తెలిపింది. ఈ ఫీచర్‌ను ఉపయోగించేందుకు ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లోని ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి, నెట్‌వర్క్ లేదా కనెక్షన్స్ ఆప్షన్‌లో WiFi Callingను యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ సేవను BSNL తమ వినియోగదారులకు పూర్తిగా ఉచితంగా అందిస్తోంది.

BSNL Rolls Out Free VoWiFi Service Nationwide to Improve Call Connectivity

నాణ్యమైన వాయిస్ కాల్స్..

నెట్‌వర్క్ కవరేజ్ పూర్తిగా లేకపోయినా, లేదా సిగ్నల్స్ వీక్ గా ఉన్నా నాణ్యమైన వాయిస్ కాల్స్ చేయగలిగేలా ఈ ఫీచర్ పనిచేస్తుందని BSNL అధికారులు తెలిపారు. ముఖ్యంగా బహుళ అంతస్తుల భవనాల్లో, బేస్‌మెంట్లు, భారీ నిర్మాణాలు ఉన్న ప్రాంతాల్లో సెల్యులార్ నెట్‌వర్క్ సిగ్నల్స్ సరిగ్గా అందని పరిస్థితుల్లో ఈ వైఫై కాలింగ్ ఫీచర్ ఎంతో ఉపయుక్తంగా మారనుంది. అంతేకాదు, సెల్యులార్ నెట్‌వర్క్‌పై ఉన్న రద్దీని తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

2025 గణాంకాల ప్రకారం

ఇటీవల కాలంలో BSNL తన నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు పలు కీలక చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా 4G నెట్‌వర్క్ ప్రారంభం అనంతరం యూజర్లలో సంస్థపై నమ్మకం పెరుగుతోంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) విడుదల చేసిన నవంబర్ 2025 గణాంకాల ప్రకారం, వోడాఫోన్ ఐడియా, MTNL మినహా మిగిలిన అన్ని టెలికాం సంస్థలు కొత్త వినియోగదారులను సంపాదించుకున్నాయి. ఈ గణాంకాల్లో BSNL ప్రత్యేకంగా నిలిచింది. నవంబర్ నెలలోనే 4,21,514 మంది కొత్త యూజర్లను ఆకర్షించడంతో సంస్థ మార్కెట్ షేర్ 7.92 శాతానికి చేరుకుంది. మరోవైపు ప్రభుత్వరంగ సంస్థ MTNL మాత్రం అదే నెలలో 7,530 మంది యూజర్లను కోల్పోయింది.

మొత్తంగా చూస్తే, 4G విస్తరణతో పాటు VoWiFi వంటి ఆధునిక ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ BSNL తన సేవలను మరింత మెరుగుపరుచుకుంటోంది. ఈ చర్యలు రానున్న రోజుల్లో సంస్థకు మరింత మంది వినియోగదారులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయని టెలికాం నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+