Social Media Ban: పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ కష్టమేనా ? అసలు సమస్యలివే..!

16 ఏళ్ల లోపు పిల్లలకు (children) సోషల్ మీడియా (social media) బ్యాన్ చేస్తూ కర్నాటక ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. వెంటనే ఏపీ ప్రభుత్వం కూడా తాము 13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేస్తామని ప్రకటన చేసేసింది. అయితే ఈ నిషేధం అమలు ఎలా చేస్తారన్న దానిపై ఇరు ప్రభుత్వాలూ ఇప్పటివరకూ క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో అసలు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేయడ సాధ్యమేనా అంటే కష్టమే అన్న సమాధానం నిపుణుల నుంచి వస్తోంది.

పిల్లల్ని గుర్తించడం ఎలా ? (Social Media)

సోషల్ మీడియాను పిల్లలకు బ్యాన్ చేయాలంటూ ముందుగా ఆయా ప్లాట్ ఫామ్స్ పిల్లల్ని గుర్తించాలి. అయితే చిన్న వయస్సు యూజర్లను అవి ఎలా గుర్తిస్తాయి? దీనిని ఎవరు అమలు చేస్తారు, రాష్ట్ర ప్రభుత్వం లేదా ప్లాట్‌ఫారమ్‌లు స్వయంగా చేయగలవా? ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను కట్టడి చేయగలదా? అంటే కష్టమనే సమాధానాలే వస్తున్నాయి. మరోవైైపు కేంద్రం వయో-ఆధారిత ఆంక్షలను పరిశీలిస్తున్నప్పటికీ, ఎంపిక చేసిన రాష్ట్రాల్లో మాత్రమే ఈ నిషేధం ఎలా అమలు చేయాలో ఇంకా స్పష్టత లేదని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఇందుకోసం ఆస్ట్రేలియా చట్టాన్ని పరిశీలిస్తున్నారు.

The Challenge of a Social Media Ban for Minors Why Enforcement is Harder Than It Seems

ఆస్ట్రేలియాలో ఏం జరిగింది ?

ఆస్ట్రేలియా ప్రభుత్వం తెచ్చిన ఆన్‌లైన్ సేఫ్టీ అమెండ్‌మెంట్ (సోషల్ మీడియా మినిమమ్ ఏజ్) చట్టం డిసెంబర్ 2025 నుండి అమల్లోకి వచ్చింది. ఇది సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేసే 16 ఏళ్లలోపు వారికి, వారి తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు ఎటువంటి జరిమానా విధించదు. ఈ విధానాన్ని ప్రభుత్వం "నిషేధం కాదు, కేవలం ఖాతాలు కలిగి ఉండటాన్ని ఆలస్యం చేయడమే అని తేల్చేసింది. అయితే 16 ఏళ్లలోపు వారు ఖాతాలు తెరవకుండా నిరోధించడానికి సహేతుకమైన చర్యలు తీసుకోకపోతే, వయో-పరిమితి ఉన్న సోషల్ ప్లాట్‌ఫారమ్‌లకు జరిమానాలు విధిస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం పేర్కొంది. అంటే పిల్లలు సోషల్ అకౌంట్లు తెరవకుండా నిరోధించడానికి చర్యలు తీసుకోని ప్లాట్‌ఫారమ్‌లపై కోర్టు ఫైన్ విధించవచ్చు.

సోషల్ ప్లాట్ ఫారమ్స్ ఏం చేస్తున్నాయి ?

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు 16 ఏళ్లలోపు వారి ఖాతాలను తొలగించడానికి వివిధ టెక్నాలజీలను వాడుతున్నాయి. వీటిలో డివైస్, ఆపరేటింగ్ సిస్టమ్, యాప్ స్టోర్ స్థాయిలో వయస్సు ధృవీకరణ, ఆస్ట్రేలియన్ బ్యాంక్ ఖాతా ఐడీ లేదా ప్రభుత్వం జారీ చేసిన ఐడీ ద్వారా వయస్సు ధృవీకరణ, లేదా రిజిస్టర్/లాగిన్ సమయంలో ఇమేజ్/వీడియో సెల్ఫీలు తీయడం ద్వారా వయస్సు అంచనా వంటి చర్యలు చేపడుతున్నాయి. పర్సనలైజ్డ్, అన్ లిమిటెడ్ కంటెంట్ ఫీడ్‌లు, టైమ్-సెన్సిటివ్ రివార్డ్‌ల ద్వారా వినియోగదారులను గంటల తరబడి ప్లాట్‌ఫారమ్‌లలో గడపడానికి ప్రోత్సహించే స్నాప్‌చాట్ వంటి వాటిని ఈ ప్లాట్‌ఫారమ్‌లుగా గుర్తించారు. కంటెంట్ మాడిఫికేషన్ టూల్స్ వంటి AI-ఆధారిత ఫీచర్లను ఉపయోగించేవి కూడా ఇందులో చేర్చారు. అయితే ప్రస్తుతానికి వాట్సాప్, పిన్‌టెరెస్ట్, మెసెంజర్, డిస్కార్డ్ వంటి వాటిని మాత్రం మినహాయించారు.

రాష్ట్రాల్లో ఆంక్షలు సాధ్యమేనా ?

అయితే పిల్లలు సోషల్ మీడియా వాడకుండా రాష్ట్ర స్థాయి ఆంక్షలు సాంకేతికంగా సాధ్యమేనా అంటే కాదు. ఇలా నిషేధం విధించడానికి రాష్ట్ర ప్రభుత్వాల పరిధి సరిపోదు. ఇంటర్నెట్ నియంత్రణ కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది. అయితే రాష్ట్రాలు ప్రత్యేకంగా చట్టాలు చేసి వాటి ఆధారంగా సోషల్ ప్లాట్ ఫామ్స్ పై ఆంక్షలు విధించవచ్చు. కానీ అవి తిరిగి చట్ట పరిధిలో నిలబడకపోతే ప్రయోజనం ఉండదు. తమిళనాడు ఆన్‌లైన్ గేమింగ్ నిషేధ, ఆన్‌లైన్ ఆటల నియంత్రణ చట్టం 2022కి వ్యతిరేకంగా మద్రాసు హైకోర్టు ముందు ఇలాంటి సమస్యే ఎదురైంది. ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు ఇంటర్నెట్-ఆధారిత కార్యకలాపాలు కేంద్ర జాబితాలోకి వస్తాయని, కాబట్టి వాటిని రాష్ట్రాలు నియంత్రించలేవని వాదించాయి. హైకోర్టు ఈ వాదనను తోసిపుచ్చింది. ప్రజారోగ్యాన్ని ప్రభావితం చేసే విషయాలను నియంత్రించడానికి రాష్ట్రానికి పూర్తి అధికారం ఉందని తేల్చింది.

The Challenge of a Social Media Ban for Minors Why Enforcement is Harder Than It Seems

ఆన్ లైన్ లో అమలూ కష్టమే..

అమలు విషయానికి వస్తే.. ప్రస్తుత చట్టాలతో కూడా ఆన్‌లైన్‌లో వయో పరిమితులను అమలు చేయడం చాలా కష్టం. చాలా ప్లాట్‌ఫారమ్‌లు ఇప్పటికీ వినియోగదారులు నమోదు సమయంలో పుట్టిన తేదీని నమోదు చేయడంపై ఆధారపడతాయి. ఇది సులభంగా బైపాస్ చేయవచ్చు. చాలా మంది టీనేజర్లు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో సైన్ అప్ చేసేటప్పుడు తప్పుడు వయస్సులను నమోదు చేస్తారనేది అందరికీ తెలిసిందే. వీళ్లను నియంత్రించేందుకు కొత్త వ్యవస్థల్ని తెచ్చినా వాటినీ ఏదో విధంగా బైపాస్ చేయొచ్చనే అంచనాలున్నాయి. కాబట్టి ఆన్ లైన్ లోనూ నియంత్రణ కష్టమేనని తేలిపోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+