Redmi Pad 2 Pro 5G Tablet ధర వివరాలు లీక్!
భారత్ మార్కెట్‌లో జనవరి 8 వ తేదీన విడుదల కాబోతుంది రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో 5G ట్యాబ్లెట్ (Redmi Pad 2 Pro 5G Tablet). ఇప్పటికే ఈ ట్యాబ్లెట్‌కు సంబంధించిన అనేక వివరాలు గ్యాడ్జెట్స్ ప్రేమికులను ఆకర్షించాయి. తాజాగా ఈ ఫోన్ చిప్‌సెట్ వివరాలు విడుదలయ్యాయి. ఇందులో దాగున్న ఫీచర్లేంటో చూద్దాం
ప్రస్తుతం ఎలాంటి హ్యాండ్ సెట్ తీసున్నా అందరూ ఆలోచించేది బ్యాటరీ బ్యాకప్ గురించి. రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో 5G ట్యాబ్లెట్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 12000mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది. అంతే కాకుండా స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 చిప్‌సెట్.. ఆండ్రాయిడ్ 15 OS పైన పనిచేస్తుందని తెలుస్తోంది.
ఈ ట్యాబ్లెట్ 12.1 అంగుళాల క్వాడ్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్ హైలెట్ గా నిలుస్తుంది. ఇందులో స్పెషల్ థింగ్ ఏంటంటే డిస్‌ప్లే డాల్బీ విజన్ సపోర్టుతో అందుబాటులోకి ఉంటుంది. ఇక విజువల్ కు సౌండ్ యాడ్ అయితేనే ఆ అనుభవాన్ని పొందగలం అందుకే.. ఆడియో పరంగా డాల్బీ అట్మాస్, వాల్యూమ్ బూస్ట్ ఫీచర్ సపోర్టుతో క్వాడ్ స్పీకర్ సపోర్టును ఇందులో ఇనుమడింపజేశారు.

కెమెరా అండ్ ర్యామ్ ఎలా ఉంటుంది..
ఈ ట్యాబ్లెట్ కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 8MP కెమెరా, ముందువైపు 8MP సెల్పీ కెమెరా ఉంది . ఈ రెడ్‌మి ప్యాడ్ ట్యాబ్లెట్ 7.5mm థిక్‌నెస్‌తో 610 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ Wi-Fi వేరియంట్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ తో మార్కెట్లోకి విడుదల కానుంది. జనవరి 6 వ తేదీన విడుదల కానుంది. సంక్రాంతికి ఈ ట్యాబ్లెట్ సేల్ ప్రారంభం కానుంది.
ఎంత ధరలో అందుబాటులోకి వస్తుంది?
Wi-Fi వేరియంట్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర సుమారుగా రూ.25 వేలు ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. షియోమీ ఇండియా ఇ-స్టోర్‌తోపాటు ఇతర ఇ-కామర్స్ స్టోర్స్‌లో కూడా అందుబాటులో ఉంటుంది.. షియోమీ స్టోర్ లో ఈ ట్యాబ్లెట్ రూ.20 వేల నుంచి రూ.30 వేల ధర రేంజ్‌లో ఉండొచ్చని సమాచారం












Click it and Unblock the Notifications