దోమలతో వ్యాక్సినేషన్.. శాస్త్రవేత్తల క్రేజీ ఐడియా!

మన రక్తం తాగి రోగాలు తెచ్చే దోమలే.. ఇప్పుడు ప్రమాదకరమైన వైరస్‌లను అంతమొందించే 'ఎగిరే వ్యాక్సిన్‌లుగా' మారబోతున్నాయి. వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజం. మానవాళిని వణికించే రేబీస్, నిపా, హెంద్రా వంటి భయంకరమైన వైరస్‌లకు సహజ నిలయాలైన అడవి గబ్బిలాలకు టీకాలు వేసేందుకు శాస్త్రవేత్తలు ఒక వినూత్నమైన మార్గాన్ని కనిపెట్టారు. దోమలకు జెనెటిక్ మార్పులు చేసిన వైరస్‌ను ఇచ్చి, వాటి ద్వారా గబ్బిలాలకు వ్యాక్సిన్ చేరవేసే అద్భుత ప్రయోగానికి తెరలేపారు.

గబ్బిలాలకు టీకా ఎందుకు? చంపేయొచ్చుగా?

నిపా, రేబీస్ వంటి వైరస్‌లు గబ్బిలాలకు ఎలాంటి అనారోగ్యం కలిగించవు గానీ, వాటి ద్వారా మనుషులకు లేదా పశువులకు సోకితే మాత్రం ప్రాణాలు పోతాయి. గబ్బిలాలు పర్యావరణానికి చాలా మేలు చేస్తాయి కాబట్టి వాటిని చంపడం అస్సలు పరిష్కారం కాదు. ఒకవేళ వాటిని చంపాలని చూస్తే, అవి భయంతో వేరే ప్రాంతాలకు చెల్లాచెదురై వైరస్‌ను మరింత వేగంగా వ్యాప్తి చేస్తాయి. అందుకే, గబ్బిలాలకు హాని చేయకుండా వాటిలోనే వైరస్‌ను అణచివేయడానికి టీకాలు వేయడం ఒక్కటే సరైన మార్గం. అయితే, దట్టమైన అడవుల్లో కోట్లాది గబ్బిలాలకు పట్టుకుని ఇంజెక్షన్ ఇవ్వడం అసాధ్యం. ఈ సమస్యకు పరిష్కారంగానే చైనాలోని బీజింగ్‌కు చెందిన 'చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్' పరిశోధకులు ఈ సరికొత్త పద్ధతిని కనిపెట్టారు.

Flying Vaccines Scientists Use Mosquitoes To Vaccinate Wild Bats Against Deadly Rabies And Nipah Viruses

దోమలు 'ఎగిరే వ్యాక్సిన్‌లుగా' ఎలా మారతాయి?

గబ్బిలాల రక్తాన్ని పీల్చడానికి వచ్చే దోమలను, అలాగే గబ్బిలాలు ఆ దోమలను ఆహారంగా తినే అలవాటును శాస్త్రవేత్తలు ఆయుధంగా మార్చుకున్నారు. పరిశోధకులు మొదట 'వెసిక్యులర్ స్టోమాటిటిస్ వైరస్' (VSV) అనే బలహీనమైన వైరస్‌ను తీసుకుని, దానికి రేబీస్ లేదా నిపా వైరస్ ప్రోటీన్లను జతచేసి ఒక వ్యాక్సిన్‌ను తయారుచేశారు. ఈ వ్యాక్సిన్ కలిపిన రక్తాన్ని ప్రయోగశాలలోని దోమలకు తినిపించారు. ఆ వైరస్ దోమల లాలాజల గ్రంధుల్లోకి చేరింది. ఇప్పుడు ఈ దోమలు గబ్బిలాలను కుట్టినా లేదా గబ్బిలాలు ఈ దోమలను తిన్నా.. వాటి శరీరంలోకి వ్యాక్సిన్ చేరి రోగనిరోధక శక్తి (యాంటీబాడీలు) పెరుగుతుంది. ఈ దోమలు అడవిలో విపరీతంగా పెరిగిపోకుండా ఉండేందుకు వీటికి ల్యాబ్‌లోనే యూవీ (UV) కిరణాల ద్వారా సంతానోత్పత్తి సామర్థ్యం లేకుండా చేశారు.

Kissing Disease: ముద్దు పెట్టుకుంటే మటాష్. ఈ వైరస్‌కు మందు లేదు!
Kissing Disease: ముద్దు పెట్టుకుంటే మటాష్. ఈ వైరస్‌కు మందు లేదు!

తాగే నీటి ద్వారా కూడా..

దోమలతో తక్కువ సంబంధం ఉండే గబ్బిలాల కోసం శాస్త్రవేత్తలు మరో పద్ధతిని కూడా కనిపెట్టారు. గబ్బిలాలకు ఉప్పు నీరు అంటే చాలా ఇష్టం. అందుకే అడవుల్లో ఖనిజ లవణాలు (ఉప్పు) ఎక్కువగా ఉండే నీటి తొట్టెలను (ట్రాప్‌లను) ఏర్పాటు చేశారు. ఇవి గబ్బిలాలను ఆకర్షించడానికి ఉప్పగా ఉండే పొగమంచును విడుదల చేస్తాయి. ఖనిజాల కోసం వచ్చే గబ్బిలాలు ఆ తొట్టెల్లోని వ్యాక్సిన్ కలిపిన నీటిని తాగడం ద్వారా కూడా టీకాను సులభంగా పొందుతాయి.

భారత్‌లోకి ఎబోలా ఎంట్రీ? రష్యా వ్యాక్సిన్ ఎంత పవర్ ఫుల్?
భారత్‌లోకి ఎబోలా ఎంట్రీ? రష్యా వ్యాక్సిన్ ఎంత పవర్ ఫుల్?

ప్రయోగం సక్సెస్.. కానీ కొన్ని అడ్డంకులు!

ల్యాబ్‌లో ఎలుకలు, హాంస్టర్లు, అడవి గబ్బిలాలపై చేసిన ఈ రెండు ప్రయోగాలు వంద శాతం విజయవంతమయ్యాయి. వ్యాక్సిన్ పొందిన జంతువులకు ఆ తర్వాత రేబీస్, నిపా వైరస్‌లను ఎక్కించినా అవి ప్రాణాలతో బయటపడ్డాయి. అయితే, ఈ పద్ధతిని నేరుగా అడవుల్లో ప్రయోగించడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. పర్యావరణ అనుమతులతో పాటు, అడవిలోని గబ్బిలాలు నిజంగానే టీకా తీసుకున్నాయో లేదో తెలుసుకోవడానికి వాటి విసర్జితాలను (పేడను) పరీక్షించే సరికొత్త పర్యవేక్షణ వ్యవస్థలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయాల్సి ఉంది. ఈ వినూత్న ప్రయత్నం గనుక పూర్తి స్థాయిలో విజయవంతమైతే, భవిష్యత్తులో గబ్బిలాల నుండి మనుషులకు వచ్చే మహమ్మారులకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+