రోహిత్ సేనను మూడు చెరువుల నీళ్లు తాగించారు..
కొలంబో: శ్రీలంక వేదికగా కొనసాగుతున్న ఆసియా కప్ 2023 టోర్నమెంట్.. సూపర్ 4లో భాగంగా భారత్ తన మలి మ్యాచ్ ఆడుతోంది. శ్రీలంకను ఎదుర్కొంటోంది. పాకిస్తాన్‌పై 350కి పైగా పరుగులు చేసిన టీమిండియా.. లంకేయులపై తడబడుతోంది. బ్యాటింగ్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది.
టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. శుభారంభం చేసినప్పటికీ- దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. వరుసబెట్టి వికెట్లను కోల్పోయింది. పాకిస్తాన్‌పై రెచ్చిపోయిన రోహిత్ శర్మ.. ఇక్కడా అంతే ధాటిగా ఆడాడు. 48 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 53 పరుగులు చేసి, వెల్లలెగె బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. శుభ్ మన్ గిల్- 19 పరుగులకే అదే వెల్లలెగె బౌలింగ్‌లో వెనుదిరిగాడు.

తొలి వికెట్ భాగస్వామ్యానికి 80 పరుగులు జోడించిన తరువాత టీమిండియా ఎక్కడే గానీ కోలుకోలేదు. భారీ భాగస్వామ్యం ఏర్పడలేదు. విరాట్ కోహ్లీ-3, ఇషాన్ కిషన్-33, కేఎల్ రాహుల్-39, హార్దిక్ పాండ్యా-5, రవీంద్ర జడేజా-4, జస్‌ప్రీత్ బుమ్రా- 5, కుల్‌దీప్ యాదవ్-0 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజ్‌లో అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్ ఉన్నారు.
వర్షం పడే సమయానికి తొమ్మిది వికెట్లను టీమిండియా కోల్పోగా.. వాటన్నింటినీ స్పిన్నర్లే నేలకూల్చడం ప్రాధాన్యతను సంతరించుకుంది. యంగ్ బౌలర్ దునిత్ వెల్లలెగె బౌలింగ్‌ను ఏ మాత్రం ఎదుర్కొనలేకపోయారు. అతని ధాటికి టాప్ ఆర్డర్ మొత్తం అతని ధాటికి కుప్పకూలింది. తన కేరీర్‌లో 12వ మ్యాచ్ ఆడుతున్న వెల్లలెగె భారత్ వంటి తిరుగులేని జట్టుపై మొదటిసారిగా అయిదు వికెట్లు పడగొట్టాడు.
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా.. అతని ధాటికి బలి అయ్యారు. 10 ఓవర్లల్లో 40 పరుగులు ఇచ్చి అయిదు వికెట్లను పడగొట్టాడు వెల్లలెగె. అతని కోటా ముగిసిన తరువాత మరో స్పిన్నర్ చరిత్ అసలంక రెచ్చిపోయాడు. 9 ఓవర్లల్లో 18 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు నేలకూల్చాడు.
ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్‌దీప్ యాదవ్ వికెట్లను తీసుకున్నాడు. బుమ్రా, కుల్‌దీప్ వికెట్లను వరుస బంతుల్లో కూల్చాడు. తృటిలో హ్యాట్రిక్ మిస్ అయ్యాడు. స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనగలదనే పేరున్న భారత జట్టు.. ఇద్దరు స్పిన్నర్ల ఉచ్చులో పడి విలవిలలాడింది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications