ఏషియన్ పారా గేమ్స్‌లో వివాదం: భారత అథ్లెట్‌ను వెనక్కి పంపిన పోలీసులు!

జపాన్‌‌లో జరుగుతున్న ఏషియన్ పారా గేమ్స్ సందర్భంగా భారత పారా స్విమ్మర్ మహమ్మద్ షమ్స్ ఆలం షేక్ తీవ్ర ఆరోపణల్లో చిక్కుకున్నారు. 40 ఏళ్ల మహమ్మద్ షమ్స్ ఆలం షేక్ ఓ మహిళా హోటల్ ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఫిర్యాదు ఆధారంగా జపాన్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని ఆ తర్వాత మంగళవారం తిరిగి ఇండియాకు పంపించివేశారు. ఇప్పుడు పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా ఆయనపై జీవితకాల నిషేధం విధించే యోచనలో ఉంది.

భారత్‌తో మరో భారీ యుద్ధం ముప్పు? పాక్ మాజీ జనరల్ సంచలన హెచ్చరిక!
భారత్‌తో మరో భారీ యుద్ధం ముప్పు? పాక్ మాజీ జనరల్ సంచలన హెచ్చరిక!

భారత బృందానికి చెందిన ఓ నివేదిక ప్రకారం.. భారత పారా స్విమ్మింగ్ జట్టు బల చేసిన హోటల్‌లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మహిళా హౌస్‌కీపింగ్ ఉద్యోగి షేక్ గదిలో తన పని చేసుకుంటున్న సమయంలో ఈ సంఘటన జరిగినట్లు తెలిసింది. బాధితురాలి ఫిర్యాదు స్థానిక నిర్వాహక కమిటీ, భారత బృంద అధికారులకు చేరింది. నిర్వాహక కమిటీ కూడా ఈ విషయాన్ని భారత అధికారుల దృష్టికి తీసుకెళ్లింది.

Asian Para Games Controversy Indian Swimmer Shams Alam Shaikh Deported Over Assault PCI considers life ban

ఫిర్యాదు అందిన వెంటనే జపాన్ పోలీసులు మహమ్మద్ షమ్స్ ఆలం షేక్‌ను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి చర్యల్లో భాగంగా మంగళవారం ఆయనను ఇండియాకు పంపించివేశారు. నగోయాలో జరుగుతున్న ఏషియన్ పారా గేమ్స్‌లో వివిధ పోటీల్లో పాల్గొనాల్సి ఉన్న మహమ్మద్ షమ్స్ ఆలం షేక్.. ఏ ఒక్క ఈవెంట్లోనూ పాల్గొనకుండానే తిరిగి రావాల్సి వచ్చింది.

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా క్రమశిక్షణా చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా మహమ్మద్ షమ్స్ ఆలం షేక్‌పై జీవితకాల నిషేధం విధించే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. క్రీడలు ముగిసిన తర్వాత ఈ వ్యవహారంపై సమీక్ష నిర్వహించి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

ముంచెత్తిన వాన: నాలుగేళ్ల నిరీక్షణ నీటిపాలు!
ముంచెత్తిన వాన: నాలుగేళ్ల నిరీక్షణ నీటిపాలు!

బీహార్‌కు చెందిన మహమ్మద్ షమ్స్ ఆలం షేక్ భారత పారా స్విమ్మింగ్ రంగంలో అనుభవజ్ఞుడైన క్రీడాకారుడు. వరల్డ్ పారా స్విమ్మింగ్ రికార్డుల ప్రకారం.. పురుషుల 100 మీటర్ల బటర్‌ఫ్లై S5, 50 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ SB4 కేటగిరీలలో ప్రపంచ నంబర్-1 ర్యాంకింగ్‌ను సాధించారు. ఆయన 2018 జకార్తా ఏషియన్ పారా గేమ్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి 200 మీటర్లు, 50 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించారు. 2026 నగోయా ఏషియన్ పారా గేమ్స్‌లో వరుసగా మూడోసారి పాల్గొనాల్సి ఉండగా.. ఈ ఆరోపణల కారణంగా ఆయన అర్థాంతరంగా వెనుదిరిగాల్సి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+