భారత్‌తో మరో భారీ యుద్ధం ముప్పు? పాక్ మాజీ జనరల్ సంచలన హెచ్చరిక!

భారత్‌తో ఉన్న వివాదాలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పాకిస్తాన్ సైనిక దళాల మాజీ జనరల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య తలెత్తే విభేదాలను సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో అత్యంత ప్రమాదకరమైన ఘర్షణలకు దారితీసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. వివిదాలకు గల అసలు కారణాలను పరిష్కరించకుండా తాత్కాలికంగా సంక్షోభాన్ని ముగించడం వల్ల తదుపరి భారీ ఘర్షణకు పునాది పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

భారత్ కు సడెన్ షాక్ ఇచ్చిన పాకిస్థాన్.. రూ. వేల కోట్ల నష్టం దిశగా భారత్..
భారత్ కు సడెన్ షాక్ ఇచ్చిన పాకిస్థాన్.. రూ. వేల కోట్ల నష్టం దిశగా భారత్..

ఇస్లామాబాద్‌లోని 'స్ట్రాటజిక్ విజన్ ఇన్‌స్టిట్యూట్" అనే థింక్ ట్యాంక్ నిర్వహించిన కార్యక్రమంలో పాకిస్తాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ మాజీ ఛైర్మన్, రిటైర్డ్ జనరల్ జుబేర్ మహమూద్ హయత్ ఈ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన కాశ్మీర్ అంశం, సింధు జలాల ఒప్పందం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. దక్షిణాసియా ప్రాంతంలో శాశ్వత శాంతి నెలకొనాలంటే కాశ్మీర్ సమస్య పరిష్కారంతో పాటు సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించడం ఎంతో కీలకమని ఆయన స్పష్టం చేశారు.

India Pakistan War Warning Former Pak General Zubair Hayat Warns of Major Conflict Full Details

ఇరు దేశాల మధ్య 2025 మే నెలలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలను గుర్తు చేస్తూ.. కేవలం అణు కార్యక్రమాలను నిరోధించడం మాత్రం యుద్ధాలను ఆపలేదని జనరల్ హయత్ వెల్లడించారు. భవిష్యతులో జరిగే ఘర్షణలను అడ్డుకోవడానికి కేవలం అణు నిరోధకతపైన ఆధారపడటంలో అనేక పరిమితులు ఉన్నాయని ఈ ఘటన నిరూపించిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ప్రాంతమూ యుద్ధం నుంచి సురక్షితం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

తుఫాను హెచ్చరిక: కొత్త అల్పపీడనం ఎఫెక్ట్.. అతి భారీ వర్షాలు
తుఫాను హెచ్చరిక: కొత్త అల్పపీడనం ఎఫెక్ట్.. అతి భారీ వర్షాలు

భవిష్యత్తులో ఎదురయ్యే సంక్షోభాలు సరికొత్త సాంకేతికతలు, భిన్నమైన రాజకీయ నాయకత్వం, వేగవంతమైన నిర్ణయాల మధ్య పూర్తిగా భిన్నమైన పరిస్థితుల్లో ఎదురవుతాయని ఆయన వెల్లడించారు. దీనివల్ల పొరపాట్లు జరగడానికి, అంచనాలు తప్పడానికి, ప్రమాదకరంగా ఉద్రిక్తతలు పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభావవంతమైన సంక్షోభ నివారణ వ్యవస్థలు, నిరంతర రాజకీయ చర్చలు లేకపోవడమే దక్షిణాసియాలో అశాంతికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+