Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వీళ్లున్నారే..SRH బీపీ పెంచుతున్నారు..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ దగ్గరికొచ్చింది. ఈ నెల 28న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మధ్య జరుగనుంది. ఈ ఐపీఎల్ ఓపెనర్ కు బెంగళూరు ఎం చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ప్రస్తుతం 10 జట్లు తమ సన్నాహకాల్లో నిమగ్నం అయ్యాయి. ప్లేయర్లందరూ తమ జట్లతో కలుస్తున్నారు. ముమ్మరంగా ప్రాక్టీస్ సాగిస్తోన్నారు.

ఈ పరిస్థితుల మధ్య కీలక ఆటగాళ్ల గాయాలు బీపీ పెంచుతున్నాయి. ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా స్టార్ పేస్ బౌలర్లు మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ టోర్నమెంట్ కు దూరం అయ్యారు. ఆరంభ మ్యాచ్ లకు అందుబాటులో ఉండట్లేదు. ఇది దాదాపుగా అన్ని జట్లకూ పెద్ద సమస్య. ప్రత్యేకించి సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కీలక ప్లేయర్లు దూరం కావడం వల్ల ఆ జట్టు అంచనాలను తలకిందులు చేస్తోంది. తమ ప్లాన్ ను మార్చుకోవాల్సి వస్తోంది.

Australian All-Rounder Jack Edwards Ruled Out of IPL with Foot Injury as SRH Plans Hit by Setback

ఆస్ట్రేలియాకు చెందిన సన్‌రైజర్స్ హైదరాబాద్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ వెన్నునొప్పి గాయంతో బాధపడుతున్నాడు. ఆసీస్ కే చెందిన ఆర్సీబీ బౌలింగ్ పిల్లర్ జోష్ హేజిల్‌వుడ్ దీ అదే దారి. అతను హామ్‌స్ట్రింగ్, అకిలెస్ టెండినిటిస్ (మడమ నరం వాపు) నుంచి కోలుకుంటున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కూ ఈ బెడద తప్పట్లేదు. తొలి మ్యాచ్‌లలో మిచెల్ స్టార్క్ ఆడట్లేదు. ఇటీవలి కాలంలో విపరీతంగా టెస్ట్ క్రికెట్ ఆడాడు. దీంతో కొంత విశ్రాంతి తీసుకుంటోన్నాడు. ఈ ముగ్గురు పేస్ బౌలర్లు ప్రారంభ మ్యాచ్ లకు దూరం అయ్యారు కూడా.

అదే సమయంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ కూడా ఈ ఐపీఎల్ సీజన్‌కు దూరం అయ్యాడు. కాలి గాయం కారణంగా ఆడట్లేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ఎడ్వర్డ్స్ కు ఇది తొలి ఐపీఎల్ సీజన్. రూ. 3 కోట్లకు బిడ్డింగ్ వార్‌లో దక్కించుకుంది కావ్యా మారన్. చెన్నై సూపర్ కింగ్స్‌తో పోటీ పడి అతన్ని సొంతం చేసుకుంది. 31 ఏళ్ల ఎడ్వర్డ్స్ జనవరిలో పాకిస్తాన్‌తో జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.

బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్ తరఫున 13 మ్యాచ్‌లలో 19 వికెట్లు, 133 పరుగులతో ఆకట్టుకునే ప్రదర్శన కనబరిచాడు. మేజర్ లీగ్ క్రికెట్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్ తరఫున 12 మ్యాచ్‌లలో 14 వికెట్లు, 152 పరుగులు చేసి తన సత్తా చాటాడు. ఎడ్వర్డ్స్ గాయంతో సన్ రైజర్స్ విదేశీ ఆటగాళ్ల కోటా మరింత బలహీనపడింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సీజన్ తొలి మ్యాచ్‌లకు దూరం కానుండగా, ఫాస్ట్ బౌలర్ ఇషాన్ మలింగ ఫిట్‌నెస్‌పైనా సందేహాలున్నాయి.

చెన్నై సూపర్ కింగ్స్ కూ ఇదే పరిస్థితి తప్పట్లేదు. ఫాస్ట్ బౌలర్ నాథన్ ఎల్లిస్ హామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా ఈ సీజన్ మొత్తం దూరం కానున్నాడు. టీ20 ప్రపంచ కప్ ముందు ఎల్లిస్ ఎదుర్కొన్న పాత హామ్‌స్ట్రింగ్ గాయం తిరిగి తిరగబెట్టడమే దీనికి కారణం. ఇటీవలే హోబర్ట్‌లో జరిగిన వన్డే కప్ ఫైనల్ సందర్భంగా ఈ గాయం మళ్ళీ తీవ్రమైంది. ఇప్పుడు అతని రీప్లేస్‌మెంట్ కోసం చూస్తోంది సీఎస్కే. ఎల్లిస్ దూరం కావడంతో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ లేని లోటు ఏర్పడింది.

క్రికెట్ ఆస్ట్రేలియా తమ ముఖ్యమైన పేస్ బౌలర్ల విషయంలో ఎటువంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. రాబోయే 12 నెలల్లో ఆస్ట్రేలియా జట్టు దాదాపు 21 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో భారత్, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా వంటి దేశాలతో జరిగే పెద్ద పర్యటనలు ఉన్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+