బంగ్లాదేశ్ ను అదును చూసి దెబ్బకొట్టిన ICC

టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లను ఆడటం కోసం భారత్ రావడానికి మొండికేస్తోన్న బంగ్లాదేశ్ జట్టుకు ఐసీసీ తుది అల్టిమేటం ఇచ్చింది. డెడ్ లైన్ పెట్టింది. గడువులోగా భారత్ లో మ్యాచ్ లను ఆడటానికి అంగీకరించకుంటే.. తామే ఈ టోర్నమెంట్ నుంచి తొలగిస్తామని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ స్థానంలో మరో జట్టును తీసుకోవడానికి ఐసీసీ అప్పుడే ప్రయత్నాలు సైతం మొదలు పెట్టింది. ప్రస్తుత టీ20ఐ ర్యాంకింగ్‌ల ఆధారంగా బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది.

ఇదే విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు స్పష్టం చేసింది. శనివారం ఢాకాలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో జరిగిన వర్చువల్ సమావేశంలో ఐసీసీ.. ఈ విషయాన్ని తెలియజేసినట్లు ఈఎస్పీఎన్ క్రిక్‌ఇన్ఫో వెల్లడించింది. భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌లో మ్యాచ్‌లను ఆడటానికి బంగ్లాదేశ్ నిరాకరించిన విషయం తెలిసిందే. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీని కోరింది. ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను కోల్ కత నైట్ రైడర్స్ నుంచి తొలగించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

Bangladesh Faces Potential T20 World Cup Reversal as Scotland Might Oust Their Spot

శ్రీలంకలో లీగ్ మ్యాచ్ లను ఆడాల్సి ఉన్న ఐర్లాండ్‌తో గ్రూప్‌ స్వాపింగ్ ప్రతిపాదనలను కూడా ఐసీసీ ముందు పెట్టింది బంగ్లాదేశ్. ఐర్లాండ్ తో గ్రూప్ స్వాపింగ్ జరిగితే ఆ జట్టు భారత్ కు వస్తుంది. బంగ్లాదేశ్ శ్రీలంకలో మ్యాచ్ లను ఆడుతుంది. ఈ ప్రతిపాదనపై ఐసీసీ.. క్రికెట్ ఐర్లాండ్ ను సంప్రదించగా.. అందుకు ఆ దేశ బోర్డు నిరాకరించింది. అదే సమయంలో బంగ్లాదేశ్‌కు లేదా మరే ఇతర జట్టుకైనా గానీ భారత్‌లో ఎటువంటి నిర్దష్ట భద్రతా ముప్పు లేదని ఐసీసీ తేల్చి చెప్పింది.

దీంతో ఈ రెండింటి మధ్య నెలకొన్న ప్రతిష్టంభన ఇప్పటికే మూడో వారంలోకి చేరుకుంది. ఫలితంగా ఐసీసీ డెడ్ లైన్ పెట్టింది బంగ్లాదేశ్ కు. ఈ నెల 21వ తేదీ లోగా టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ల కోసం భారత్ కు రావడానికి అంగీకరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. లేకపోతే బంగ్లాదేశ్ కు బదులుగా స్కాట్లాండ్ ను తీసుకుంటామని తెలిపింది.

నిజానికి- టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ లో బంగ్లాదేశ్ నాలుగు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఫిబ్రవరి 7 కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో తన తొలి మ్యాచ్ లో వెస్టిండీస్ తో తలపడాల్సి ఉంది. 9న ఇటలీ, ఆ తర్వాత ఇంగ్లాండ్‌ను ఢీకొట్టాల్సి ఉంది. వీటికి కూడా ఈడెన్ గార్డెన్సే వేదిక. అనంతరం ముంబై వాంఖడే స్టేడియంలో నేపాల్‌తో మ్యాచ్ ఆడాలి. ముస్తాఫిజుర్ ను కేకేఆర్ తొలగించడంతో భద్రత పరమైన కారణాలను తెరమీదికి తెచ్చింది బంగ్లాదేశ్. ఈ మ్యాచ్ లను శ్రీలంకకు షిఫ్ట్ చేయాలని ఐసీసీని కోరింది. దీన్ని తాజాగా ఐసీసీ తిరస్కరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+