Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జాక్ పాట్ కొట్టిన టీమిండియా..!!

ఐసీసీ వరల్డ్ కప్ ను సొంతం చేసుకున్న భారత మహిళల జట్టుకు బీసీసీఐ తీపికబురు వినిపించింది. విశ్వ విజేతగా నిలిచిన జట్టుకు భారీగా క్యాష్ రివార్డు ప్రకటించింది. ఆదివారం నవీ ముంబై స్టేడియంలో జరిగిన విమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ లో దక్షిణాఫ్రికాను మట్టికరిపించిన జట్టుపై కనకవర్షాన్ని కురిపించింది. వరల్డ్ కప్ ను గెలిచినందున భారీ నగదు బహుమతిని అందజేయనుంది. దీని విలువ 51 కోట్ల రూపాయలు.

ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ లో హర్మన్‌సేన 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 298 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ- 87, దీప్తి శర్మ- 58 హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. స్మృతి మంధాన- 45, రిచా ఘోష్- 34 కీలక ఇన్నింగ్స్ ఆడారు. బ్యాటింగ్ ఆర్డర్ వెన్నెముకగా నిలిచారు. జట్టును భారీ స్కోర్ దిశగా నడిపించారు. జెమిమా రోడ్రిగ్స్- 24, హర్మన్ ప్రీత్ కౌర్- 20, అమన్ జోత్ కౌర్- 12, రాాధా యాదవ్- 3 పరుగులు చేశారు.

BCCI Announces Massive Rs 51 Crore Cash Prize for ICC Women s World Cup Victors

అనంతరం సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ లారా వోల్వార్డ్ చేసిన సెంచరీ వృధా అయింది. 98 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 101 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా జట్టును గట్టెక్కించలేకపోయింది. డెర్కసెన్- 35 మినహా మరే బ్యాటర్ కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. టాజ్మిన్ బ్రిట్స్- 23, సునే లూస్- 25, సైనాలో జాఫ్తా- 16, నదీనె డీ క్లెర్క్- 18 మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ అందుకోగలిగారు.

భారత బౌలర్లలో దీప్తి శర్మ సత్తా చాటింది. 39 పరుగులు ఇచ్చి అయిదు వికెట్ల పడగొట్టింది. సౌతాఫ్రికా పతనాన్ని శాసించింది. షెఫాలీ వర్మ- 2, శ్రీ చరణి ఒక వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది.. విమెన్స్ టీమిండియా. ప్రపంచకప్‌ను ముద్దాడింది. చారిత్రక విజయాన్ని అందుకుంది.

ఈ నేపథ్యంలో జట్టుకు బీసీసీఐ భారీ నగదు బహుమతిని ప్రకటించింది. ప్రైజ్ మనీకి ఇది అదనం. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. 51 కోట్ల రూపాయల నగదు బహుమతిని అందజేయనున్నట్లు వెల్లడించారు. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో భారత జట్టు వరల్డ్ కప్ ను గెలిచి ఓ కొత్త శకానికి నాంది పలికారని, ఆ స్థాయిలో మహిళ జట్టు ఈ విజయాన్ని అందుకుందని ప్రశంసించారు. కొత్త తరం మహిళా క్రికెటర్లకు బాటలు వేశారని కితాబిచ్చారు.

బీసీసీఐ కార్యదర్శిగా జై షా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి మహిళల క్రికెట్‌లో అనేక మార్పులు వచ్చాయని సైకియా వెల్లడించారు. రెమ్యునరేషన్ కూడా సమానంగా అందజేస్తోన్నామని, మహిళల ప్రైజ్‌ మనీని 300 శాతం పెంచారని గుర్తు చేశారు. గతంలో 2.88 మిలియన్ డాలర్లుగా ఉన్న ప్రైజ్‌మనీ ఇప్పుడు 14 మిలియన్ డాలర్లకు పెరిగిందని అన్నారు. ఆయా చర్యలన్నీ మహిళల క్రికెట్‌ను ప్రోత్సహించాయని పేర్కొన్నారు. ఆటగాళ్లు, కోచ్‌లు, సపోర్టింగ్ స్టాఫ్ కు 51 కోట్ల బహుమతిని అందిస్తామని ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+