భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ టీమ్ లో భారీ మార్పులు
భారత క్రికెట్ జట్టు కోచింగ్ స్టాఫ్ లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో వరుసగా సిరీస్ లను ఓడిపోవడం దీనికి కారణమైంది. ఐర్లాండ్ వంటి చిన్న జట్టుపై రెండు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను ఓడిపోయింది టీమిండియా. ఇంగ్లాండ్ టూర్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ టీ20, వన్డే సిరీస్ లల్లో పరాజయ భారాన్ని మూటగట్టుకుంది. ఈ పరిణామాలు.. జట్టు కోచింగ్ స్టాఫ్ లో మార్పులకు దారి తీశాయి.
జట్టు బ్యాటింగ్ కోచ్ ర్యాన్ టెన్ డొస్చాట్, ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ ఇద్దరూ తమ తప్పుకొన్నారు. వారి కాంట్రాక్ట్ ను పొడిగించకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రెకమండేషన్ తో టీమిండియా బ్యాటింగ్ కోచ్ గా వచ్చిన నెదర్లాండ్ మాజీ కేప్టెన్ ర్యాన్ టెన్ డొస్చాట్‌కు ఫీల్డింగ్ కోచ్ గా అపాయింట్ చేస్తామని అప్పట్లో బీసీసీఐ వెల్లడించింది గానీ అది వాస్తవ రూపం దాల్చలేదు. దాదాపుగా రెండేళ్లపాటు ఆయనకు ఎలాంటి స్పష్టమైన బాధ్యతలను అప్పగించలేదు.

దీంతో ఆశించిన స్థాయిలో ర్యాన్ జట్టుకు తన సేవలను అందించలేకపోయారు. అదే సమయంలో ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ పనితీరుపై కూడా బీసీసీఐ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్ లల్లో భారత జట్టు పేలవమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబరచడం ఆయన ఉద్వాసనకు దారితీసింది. డొస్చాట్ రాజీనామా చేసిన వెంటనే టీ దిలీప్ పై వేటు వేసింది బీసీసీఐ.
అతని స్థానంలో శుభదీప్ ఘోషను నియమించింది. బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ హయాం నుండి సుమారు ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ సేవలందిస్తూ వస్తోన్నారు.. శుభదీప్ ఘోష్. దేశవాళీ క్రికెట్ లో అతనికి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. టీమిండియా విమెన్స్ టీమ్, ఇండియా-ఎ జట్ల ఆటగాళ్లకు శారీరక సామర్థ్యం, ఫీల్డింగ్ మెళకువలను నేర్పించిన అనుభవం ఆయనకు ఉంది.
1968లో అస్సాంలోని డిగ్బోయ్ లో జన్మించారు శుభదీప్. అస్సాం, రైల్వేస్ కు ప్రాతినిథ్యాన్ని వహించారు. కుడిచేతి వాటం మిడిల్ ఆర్డర్ బ్యాటర్, ఆఫ్ స్పిన్నర్‌గా రాణించారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 17 మ్యాచ్‌లు ఆడి 316 పరుగులు, లిస్ట్- ఏ లో 17 మ్యాచ్‌లు ఆడి 307 పరుగులు చేశారు. 1994-95 సీజన్‌లో అరంగేట్రం చేసిన ఆయన పదేళ్ల పాటు దేశవాళీ క్రికెట్ లో కొనసాగారు. 2004-05 సీజన్ లో క్రికెట్ కు వీడ్కోలు పలికారు.
2021 లో భారత మహిళల జాతీయ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళిన సమయంలో ఆయన ఫీల్డింగ్ కోచ్‌గా సేవలు అందించారు. అనంతరం 2024 అండర్-19 ప్రపంచకప్ లో భాగస్వామి అయ్యారు. ఐపీఎల్ లోనూ కొనసాగుతున్నారు. 2014 లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న సీజన్‌లో ఘోష్ కీలక కోచింగ్ పాత్ర పోషించారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీ క్యాపిటల్స్ కు కూడా ఫీల్డింగ్ కోచ్‌గా పలు సీజన్ల పాటు పని చేశారు.














Click it and Unblock the Notifications