ముంబై జట్టులో విభేదాలు..రెండుగా చీలిపోయిన ఆటగాళ్లు
కెప్టెన్ మార్పు ముంబై ఇండియన్స్ జట్టుకు కొత్త తలనొప్పులు తీసుకువచ్చింది. జట్టుకు ఐదుసార్లు టైటిల్ అందించిన కెప్టెన్‌ను తొలగించి హార్దిక్ పాండ్యాకు జట్టు బాధ్యతలు అప్పగించింది ముంబై ఇండియన్స్ యాజమాన్యం. రోహిత్ శర్మను కెప్టెన్ నుంచి తొలగించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే సమయంలో తొలి మ్యాచ్ సందర్భంగా రోహిత్ పట్ల హార్దిక్ పాండ్యా వ్యవహారించిన తీరు కూడా వివాదాస్పదంగా మారింది.
మ్యాచ్ జరుగుతున్న సమయంలో రోహిత్‌ను కావాలనే హార్దిక్ పాండ్యా బౌండరీ లైన్ వద్దకు పంపించారని రోహిత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహిత్, హార్దిక్ పాండ్యాల మధ్య అభిప్రాయభేదాలు గ్రౌండ్‌లోనే బయటపడ్డాయి. దీనికి తోడు తొలి రెండు మ్యాచుల్లో ఓడిపోవడంతో హార్దిక్ పాండ్యాపై ఒత్తిడి పెరిగింది. తాజాగా ముంబై ఇండియన్స్ జట్టులో ఆటగాళ్ల మధ్య విభేదాలు తత్తినట్టు తెలుస్తోంది. జట్టులోని ఆటగాళ్లు రెండుగా చీలిపోయినట్టు సమాచారం అందుతోంది.

హార్దిక్ కెప్టెన్సీలో సీనియర్ ఆటగాళ్లు ఆడటానికి పెద్దగా ఇష్టపడటం లేదని తెలుస్తోంది. సీనియర్ ఆటగాళ్లకు హార్దిక్ సరైన గౌరవం ఇవ్వడం లేదని కొందరు జట్టు యాజమాన్యానికి ఫిర్యాదు చేశారట. దీంతో జట్టులో రోహిత్ వర్గం, హార్దిక్ పాండ్యా వర్గం అంటూ ఆటగాళ్లు రెండుగా చీలిపోయారట. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ముంబై ఇండియన్స్ యాజమాన్యం రోహిత్ శర్మ , హార్దిక్ పాండ్యాల మధ్య వివాదానికి తెర దించాలని భావించి.. జట్టుతో ఎమర్జెన్సీ సమావేశం నిర్వహించింది.
ముంబై ఆటగాళ్లతో ఒక్కొక్కరితో యాజమాన్యం భేటీ అయ్యారని తెలుస్తోంది. జట్టులో ఎవరికైనా సమస్యులుంటే చెప్పాలని ప్రతి ఒక్క ఆటగాడిని ముంబై యాజమాన్యం కోరిందట. ఇక రోహిత్, హార్దిక్ పాండ్యాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన జట్టు యాజమాన్యం వీరి మధ్య ఉన్న విభేదాల గురించి చర్చించారట.
ఏమైన ఉంటే జట్టు యాజమాన్యం దృష్టికి తీసుకురావాలని.. అంతేకాని మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదని రోహిత్, హార్దిక్‌లను హెచ్చరించినట్టు సమాచారం. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని రోహిత్, హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ యాజమాన్యం హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. యాజమాన్యం తీసుకున్న చర్యలతో అయిన ముంబై ఇండియన్స్ జట్టు గాడిలో పడుతుందేమో చూడాలి.












Click it and Unblock the Notifications