T20 World Cup: మళ్లీ భారత్-పాక్ మధ్య దూరిన ట్రంప్..! ఎలాగో తెలుసా?
భారత్-పాకిస్తాన్, ట్రంప్ ఈ ముగ్గురికీ మధ్య కనిపించని అవినాభావ సంబంధం ఉంటుంది. గతేడాది భారత్ లోని పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై మన దేశం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఇది జోరుగా కొనసాగుతున్న తరుణంలో మధ్యలో దూరిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగేలా చూసారు. వాణిజ్య ఒప్పందాల్ని అడ్డుపెట్టి భారత్-పాక్ యుద్దం ఆపినట్లు ట్రంప్ పదే పదే చెప్పుకున్నా మన దేశం మాత్రం ఖండిస్తూ వస్తోంది.
అయితే తాజాగా మరోసారి భారత్-పాకిస్తాన్ (india-pakistan)మధ్యలోకి అదే డొనాల్డ్ ట్రంప్ (donald trump) దూరిపోయారు. అదెక్కడో తెలిస్తే షాక్ కావడం ఖాయం. ఇది ప్రస్తుతం భారత్-శ్రీలంక ఆతిధ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ (T20 world cup 2026)లో. ట్రంప్ దేశం అమెరికా జట్టు ఈసారి వరల్డ్ కప్ లో దుమ్మురేపుతోంది. భారత్-పాకిస్తాన్ లతో పాటు గ్రూప్ ఏలో ఉన్న అమెరికా ఇప్పటివరకూ ఆడిన నాలుగు మ్యాచ్ లలో రెండు గెలిచింది. తద్వారా నాలుగు పాయింట్లు తెచ్చుకుంది. అదే సమయంలో నెట్ రన్ రేట్ కూడా మెరుగ్గానే ఉంది.

దీంతో 6 పాయింట్లతో ఉన్న భారత్ తర్వాత గ్రూప్ ఏ పాయింట్ల పట్టికలో అమెరికాలో రెండో స్ధానంలో నిలిచింది. ఆ తర్వాత పాకిస్తాన్ కు కూడా నాలుగు పాయింట్లు ఉన్నప్పటికీ మూడో స్ధానానికి పరిమితమైంది. దీనికి కారణం అమెరికా జట్టు నెట్ రన్ రేట్. అమెరికాకు ప్రస్తుతం ప్లస్ 0.787 నెట్ రన్ రేట్ ఉండగా.. పాకిస్తాన్ కు మైనస్ 0.403 నెట్ రన్ రేట్ ఉంది. దీంతో పాకిస్తాన్ కు మూడో స్ధానం తప్పలేదు. దీంతో భారత్-పాకిస్తాన్ మధ్యలో అమెరికా ఉంది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో సెటైర్లకు కారణమవుతోంది. మరోవైపు అమెరికా సూపర్ 8కు చేరే అవకాశాలున్నాయో అంటే కచ్చితంగా అవునని, కాదని చెప్పలేని పరిస్దితి. పాకిస్తాన్ తదుపరి మ్యాచ్ నమీబియా చేతిలో ఓడి, నెట్ రన్ కూడా అమెరికా కన్నా తక్కువగా ఉంటే అమెరికా సూపర్ 8కు చేరే అవకాశం ఉంటుంది.
-
Hormuz: హార్ముజ్ లో అసలు నష్టం భారత్ కే? కేంద్రం షాకింగ్ ..! -
భారత్ కు మెషిన్ గన్స్ పంపించిన ఇజ్రాయెల్.. పాకిస్థాన్ పని ఖతం.. -
Hormuz: హార్ముజ్ కోసం రంగంలోకి 35 దేశాలు-భారత్ కీలక నిర్ణయం..! -
Pakistan: ఏప్రిల్ 4 నుంచి లాక్ డౌన్..? సంచలన నిర్ణయం దిశగా ప్రభుత్వం.. -
ఆంజనేయుడి దివ్యమంత్రం -
షుగరు బాధితులు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తినాలి..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications