తల్లిపై కోపడిన రోహిత్ శర్మ.. కెప్టెన్ తీరుపై విమర్శలు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన ఓ పనికి నెటిజన్లు అతనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో భారత్ గెలుపొందిన విషయం తెలిసిందే. లీగ్ దశ నుంచి ఫైనల్ వరకు అజేయంగా నిలిచిన రోహిత్ సేన.. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఘన విజయం సాధించిటైటిల్‌ను సొంతం చేసుకుంది. దీంతో భారత్ ఖాతాలో పదమూడేళ్ల తర్వాత మరో వరల్డ్‌కప్ ట్రోఫీ చేరింది.

దీంతో ఐసీసీ టైటిళ్ల సంఖ్య నాలుగైంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత ముంబైకి పయనమైన రోహిత్ సేన బస్ పెరేడ్‌లో పాల్గొంది. వాంఖడే స్టేడియంలో అభిమానులకు అభివాదం చేస్తూ చిరస్మణీయ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. వాంఖడేలో సన్మానం అనంతరం బీసీసీఐ ప్రకటించిన రూ.125 కోట్ల నగదు బహుమతిని జట్టు సభ్యులకు అందించడం జరిగింది. ఇదిలా ఉంటే.. కెప్టెన్ రోహిత్ శర్మ తల్లి పూర్ణిమ శర్మ సైతం ఈ ఆనందోత్సవంలో భాగమయ్యారు.
Such a sweet moment between Rohit Sharma and his mom 🥹❤️ pic.twitter.com/u8hXhr3LVL
— Vinesh Prabhu (@vlp1994) July 4, 2024
ఈ క్రమంలో కుమారుడిని చూసి తీవ్ర భావోద్వేగానికి గురైన ఆమె.. ఆప్యాయంగా ముద్దుల వర్షం కురిపించారు. అయితే, ఈ సమయంతో రోహిత్ శర్మ ప్రవర్తించిన తీరుపై విమర్శలొస్తున్నాయి. తల్లి ప్రేమను లెక్కలోకి తీసుకోకుండా అక్కడ నుంచి వెళ్లిపోవడానికి రోహిత్ శర్మ ప్రయత్నించినట్టుగా అనిపించింది. ఈ క్రమంలో కొంతమంది రోహిత్‌ను టార్గెట్ చేశారు. భార్య, కూతురితో ఉన్నంత అనుబంధం తల్లితో లేదా? అంటూ నెటిజన్లు రోహిత్ శర్మను ప్రశ్నిస్తున్నారు.రోహిత్ ఇలా చేయడం బాలేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications