భారత్‌పై ఓవర్ యాక్షన్ చేశావ్.. ఇప్పుడు చూడు ఎంత పనైందో ..!
ఆసియా కప్ 2025లో దాయాదుల పోరు (IND vs PAK) కేవలం బ్యాట్, బాల్ మధ్య పోటీగానే మాత్రమే జరగలేదు. మైదానంలో ఆటగాళ్లు తమ భావోద్వేగాలను అదుపు చేసుకోలేక చేసిన కొన్ని తప్పులు ఇప్పుడు పెద్ద శిక్షకు దారితీశాయి. క్రికెట్‌కు చెడ్డపేరు తెచ్చినందుకు గానూ ICC క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరిగింది.
దీనిలో భాగంగానే టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్‌తో పాటు, పాక్ బౌలర్ హారిస్ రవూఫ్‌లపై ICC తీసుకుంది.పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హారిస్ రవూఫ్ అత్యంత భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ఇండియా- పాక్ మధ్య జరిగిన యుద్ధాన్ని తలచుకుంటూ చేసిన "6-0" సంజ్ఞ విమానం దిగుతున్నట్లు చేసిన హావభావాలు క్రికెట్‌కు అపఖ్యాతి తెచ్చాయని ICC నిర్ధారించింది. దీంతో అతనిపై చర్యలకు ICC ఉపక్రమించింది.

ఆర్టికల్ 2.21 ఉల్లంఘన కింద రెండు మ్యాచ్‌ల నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అలాగే మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత, రెండు డీమెరిట్ పాయింట్లు సైతం విధించింది.అంతర్జాతీయ వేదికపై భావోద్వేగాలు అదుపు తప్పితే శిక్ష తప్పదని ఈ తీర్పు స్పష్టం చేసింది.
భారత జట్టులోని స్టార్ ఆటగాళ్లు కూడా ICC కళ్ల నుండి తప్పించుకోలేకపోయారు. ముఖ్యంగా, సూర్యకుమార్ యాదవ్‌పై వేటు పడింది. సూర్యకుమార్‌కు మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానాతో పాటు ,రెండు డీమెరిట్ పాయింట్లు కోత విధించింది.
పాక్ విజయం తర్వాత సాంప్రదాయకంగా జరిగే కరచాలనంలో పాల్గొనకుండా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోవడం ఆటకు చెడ్డపేరు తెచ్చే ప్రవర్తనగా పరిగణించబడింది. అందుకే సూర్య కుమార్ యాదవ్‌పై ICC చర్యలు తీసుకున్నట్టు తెలిపింది. ఆ సమయంలో ఉన్న రాజకీయ ఉద్రిక్తతలు, అభిమానుల సెంటిమెంట్‌ను SKY నిర్ణయం ప్రతిబింబించిందని విశ్లేషకుల అభిప్రాయపడ్డారు.
అలాగే, సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన తప్పిదాన్ని అంగీకరించడంతో, అధికారిక హెచ్చరిక ,ఒక డీమెరిట్ పాయింట్‌తో సరిపెట్టుకున్నాడు. అయితే, యువ సంచలనం అర్ష్‌దీప్ సింగ్‌పై వచ్చిన ఆరోపణలను ICC కొట్టిపారేసి, అతడిని నిర్దోషిగా ప్రకటించడం భారత అభిమానులకు ఊరటనిచ్చింది. ఈ శిక్షలతో, క్రికెటర్లు కేవలం ఆటగాళ్లు మాత్రమే కాదు, యువతకు ఆదర్శంగా ఉండాల్సిన బాధ్యత తమపై ఉందని ICC మరోసారి గట్టిగా గుర్తుచేసింది.












Click it and Unblock the Notifications