IND vs AUS final: నో రోహిత్, నో కోహ్లీ: యువరాజ్ సింగ్ వరల్డ్ కప్ హీరో అతనే
అహ్మదాబాద్: క్రికెట్ ప్రపంచంలో బిగ్ డే. విశ్వ విజేత ఎవ్వరో ఇంకొన్ని గంటల్లో తేలిపోతుంది. ఓటమి అనేదే తెలియని భారత జట్టును ఈ తుదిపోరులో ఆస్ట్రేలియా ఢీ కొట్టనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం దీనికి వేదిక. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.
ఫైనల్స్‌లో తలపడబోయే భారత తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతోందనేది ఆసక్తి రేపుతోంది. లీగ్స్ దశ నుంచి సెమీ ఫైనల్స్ వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు టీమిండియా. బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ దూకుడు మీద ఉన్నారు.

బౌలింగ్ డిపార్ట్‌మెంట్ సత్తా చాటుతోంది. ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపించింది. బ్యాటర్లు భారీగా పరుగులు చేస్తోండగా.. బౌలర్లు ప్రత్యర్థులను ఎక్కడికక్కడ కట్టడి చేస్తోన్నారు. జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.. బ్యాటర్లను భయపెడుతున్నారు. లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులను సంధిస్తూ నిప్పులు చెరుగుతున్నారు. రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్ తమ స్పిన్ మాయాజాలంతో కట్టి పడేస్తోన్నారు.
జట్టు కూర్పుపై టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh).. స్పందించాడు. ఫైనల్స్‌లో తలపడే జట్టు ఎలా ఉండాలనే విషయంపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఇప్పుడున్న తుదిజట్టులో ఎలాంటి మార్పులకు దిగకపోవడమే మంచిదని వ్యాఖ్యానించాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు సమతూకంగా ఉన్నాయని పేర్కొన్నాడు.

ప్రత్యేకించి- ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammad Shami) పై యువరాజ్ సింగ్ ప్రశంసల వర్షాన్ని కురిపించాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపిస్తూ వస్తోన్నాడని కితాబిచ్చాడు. ఫాస్ట్ బౌలింగ్‌కు అసలు సిసలు నిర్వచనాన్ని ఇస్తోన్నాడని, ఈ వరల్డ్ కప్‌ను భారత్ గెలిస్తే.. అందులో షమీ (Shami) పాత్రే అధికంగా ఉంటుందని చెప్పాడు.
భారత జట్టులో ఎప్పుడూ మ్యాచ్ విన్నర్లే ఉంటారని, ఇందులో ఎలాంటి సందేహాలకు తావు లేదని వ్యాఖ్యానించాడు. హార్దిక్ పాండ్యా గాయ పడటం వల్ల తుదిజట్టులో చోటు దక్కించుకున్న మహ్మద్ షమీ.. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నాడు. ఫైనల్స్‌లో అతని పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతోందనేది అందరిలోనూ ఉత్కంఠతను రేకెత్తిస్తోందని చెప్పాడు.

ఈ వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డుకు షమీ ఒక్కడే అర్హుడని యువరాజ్ సింగ్ స్పష్టం చేశాడు. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లల్లో 23 వికెట్లను పడగొట్టడం అంటే మాటలు కాదని, అలాంటి అసాధ్యాన్ని షమీ అలవోకగా సాధించాడని గుర్తు చేశాడు. ఫైనల్స్‌లోనూ మెరుపులు మెరిపిస్తాడని చెప్పాడు.
రోహిత్ శర్మ- రాహుల్ ద్రావిడ్ కాంబినేషన్ సరిగ్గా కుదిరిందని, వారి అంచనాలకు తగ్గట్టుగా ప్లేయర్లు ఆడుతున్నారని యువరాజ్ సింగ్ వ్యాఖ్యానించాడు. తొలి మెడల్ వారిద్దరికే దక్కుతుందని పేర్కొన్నాడు. ఆసియా కప్‌లో ఆరంభమైన భారత జట్టు జైత్రయాత్ర వరల్డ్ కప్ ఫైనల్స్ వరకూ చేరడానికి రోహిత్- ద్రావిడ్ కాంబో కారణమని అన్నాడు.
-
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications