‘బై బై పాకిస్థాన్..’ గ్రౌండ్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లకు చుక్కలు చూపించిన యువతి

ఆసియా కప్ సూపర్-4లో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన పోరు ఉత్కంఠగా సాగి, చివరకు ఏకపక్షంగా ముగిసింది. అంచనాలను మించి రాణించిన టీమిండియా, పాకిస్తాన్‌ను చిత్తు చేసి ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో పాక్ జట్టుతో పాటు అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.

తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులు చేసింది. ఫర్హాన్ అద్భుతమైన అర్ధ సెంచరీతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. భారత బౌలర్లలో శివమ్ ధూబే రెండు వికెట్లు తీసి పాక్‌ను కట్టడి చేశాడు.

India Defeats Pakistan in Asia Cup Abhishek Sharma s Heroics and Bye Bye Pakistan Fan Video Goes Viral

అయితే, లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభమన్ గిల్ పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా, అభిషేక్ శర్మ తనదైన శైలిలో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడి 74 పరుగుల అర్ధ సెంచరీతో జట్టును విజయానికి దగ్గరగా తీసుకెళ్లాడు. చివర్లో తిలక్ వర్మ మెరుపులు మెరిపించడంతో భారత్ 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని సాధించి ఘన విజయం అందుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అభిషేక్ శర్మకు లభించింది.

ఈ ఉత్కంఠ పోరులో పాకిస్తాన్ ఓటమిపై ఒక భారతీయ అభిమాని చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్టేడియంలో ఆకుపచ్చ చీర ధరించిన ఓ యువతి "బై బై పాకిస్తాన్" అంటూ నినాదాలు చేస్తూ కనిపించింది. ఆమె చూపించిన ఉత్సాహం, ప్రత్యేకమైన దుస్తులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ వీడియోను కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాక్ ఓటమిపై మరింత చర్చకు దారి తీసింది.పాకిస్థాన్ ఆటగాళ్లు చేసిన ఓవరాక్షన్‌కు ఆ యువతి సరైన బుద్ది చెప్పిందని, ఆ యువతి చూపిన ధైర్యం కూడా టీమిండియా ఆటగాళ్లు చూపించలేకపోయారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా తమ ఓటమికి భారత ఓపెనర్ల దూకుడే కారణమని పేర్కొన్నాడు. తమకు ఫ్లాట్ పిచ్‌లు కాకుండా మంచి పిచ్‌లు ఉంటే మెరుగ్గా ఆడేవాళ్లమని తమ సొంత దేశానికే చురకలు అంటించాడు. ఈ ఓటమి పట్ల పాకిస్తాన్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+