పాకిస్తాన్ కే సెమీస్ ఛాన్స్- భారత్ ద్వారాలు మూసుకుపోయాయ్: అదొక్కటే చిట్టచివరి ఆశ

టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ విజయాల పరంపరకు బ్రేక్ పడింది. ఆదివారం రాత్రి అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయం పాలైంది. 76 పరుగుల తేడాతో ఓటమి టోర్నమెంట్ చరిత్రలో భారత్‌కు అతిపెద్ద పరాజయం రికార్డును నమోదు చేసింది. ఈ ఓటమి తర్వాత టీమిండియా సెమీ ఫైనల్స్ అవకాశాలు దాదాపుగా సన్నగిల్లాయి. దాదాపు ద్వారాలు మూసుకుపోయాయి.

మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ 35 బంతుల్లో 63 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు. భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా బ్యాటింగ్ ఆది నుంచీ తడబడింది. పూర్తి ఓవర్లు కూడా ఆడకుండా చేతులెత్తేసిందంటే సఫారీల బౌలింగ్ పదును ఏ స్థాయంలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 18.5 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ ఓటమితో టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్‌కు సెమీఫైనల్ చేరే మార్గం కఠినంగా మారింది.

India semi final scenario Hopes in doubt after huge defeat by South Africa in T20 World Cup Super 8

పాకిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు కథను మలుపు తిప్పగా, భారత్‌పై దక్షిణాఫ్రికా సాధించిన విజయం మొత్తం సమీకరణాలను మార్చివేసింది. టీ20 ప్రపంచ కప్‌లో గత 12 మ్యాచ్‌లలో అజేయంగా నిలిచిన టీమిండియా, ఒక్క ఓటమి కారణంగా సెమీఫైనల్స్‌కు దూరమయ్యే ప్రమాదంలో పడింది. ఈ ఓటమి భారత్ టైటిల్‌ను నిలబెట్టుకునే ఆశలను చెల్లాచెదురు చేయవచ్చు.

సూపర్ 8 ఫార్మాట్‌ ప్రకారం.. ప్రతి గ్రూప్‌లోని నాలుగు జట్లు మిగిలిన మూడు ప్రత్యర్థులతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. గెలుపొందిన జట్టుకు 2 పాయింట్లు, ఫలితం తేలని మ్యాచ్‌లకు 1 పాయింట్, ఓటమికి 0 పాయింట్లు కేటాయిస్తారు. పాయింట్లు సమానంగా ఉంటే, నెట్ రన్ రేట్ ఆధారంగా సెమీఫైనల్ బెర్తులు నిర్ణయిస్తారు.

ప్రస్తుతం సూపర్ 8లోని గ్రూప్ 1 పరిస్థితిని పరిశీలిస్తే దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో ఉంది. తొలి మ్యాచ్‌లో విజయం సాధించి 2 పాయింట్లు మరియు +3.800 నెట్ రన్ రేట్‌తో ఉంది. భారత్ ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. భారత్‌ ఖాతాలో 0 పాయింట్లు ఉన్నాయి. నెట్ రన్ రేట్ -3.800కి పడిపోయింది. ఈ గ్రూప్ నుండి రెండు జట్లకు మాత్రమే సెమీ ఫైనల్ బెర్తులు లభిస్తాయి. భారత్ తమ తదుపరి రెండు మ్యాచ్‌లూ - జింబాబ్వే, వెస్టిండీస్‌తో - భారీ తేడాతో గెలవాలి. ఇతర జట్ల రన్ రేట్ కూడా భారత్‌కు అనుకూలంగా ఉండాలి.

మూడు జట్లు రెండేసి విజయాలను సాధిస్తే, రన్ రేట్ నిర్ణయాత్మకం అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో భారత్ ప్రస్తుత చెత్త నెట్ రన్ రేట్ తీవ్ర నష్టం కలిగించవచ్చు. సూపర్-8 గ్రూప్ 2లో ఇంగ్లాండ్ తొలి మ్యాచ్ విజయం తర్వాత 2 పాయింట్లు, +2.550 నెట్ రన్ రేట్‌తో అగ్రస్థానంలో ఉంది. పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలక ఇరు జట్లకు చెరో పాయింట్, 0.000 నెట్ రన్ రేట్ లభించాయి. శ్రీలంక మొదటి మ్యాచ్‌లో ఓటమి పాలై 0 పాయింట్లు, -2.550 నెట్ రన్ రేట్‌తో నాలుగో స్థానంలో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+