India vs New Zealand: క్రికెట్ ఫ్యాన్స్ క్రేజీ అప్‌డేట్ - ఇక పండుగే..!!
క్రికెట్ ఫ్యాన్స్ కు బిగ్ అప్డేట్. భారత్ - కివీస్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ లో టీమిండియా ఆధిక్యతలో ఉంది. ఈ రోజు మూడో మ్యాచ్ జరగనుంది. అయిదు మ్యాచ్ ల సిరీస్ లో సూర్య సేన ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ సొంతం అవుతుంది. కాగా, ఈ మ్యాచ్ ను కివీస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకునే అవకాశం ఉంది. తొలి రెండు మ్యాచుల్లోనూ టీమిండియా అన్ని విభాగాల్లోనూ పై చేయి సాధించింది. అయితే.. ఈ నెల 28న విశాఖ వేదికగా నాలుగో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్ పైన ఫ్యాన్స్ కు బిగ్ అప్డేట్ వచ్చింది.
రెండో టీ20 లో ఇషాన్ కిషన్- సూర్య కుమార్ బ్యాటింగ్ విన్యాసాలు ఫ్యాన్స్ కు చాలా కాలం గుర్తు ఉండిపోతాయి. ఆ మ్యాచ్ లో ఓపెనర్ అభిషేక్ విఫలమైనా ఇషాన్ కిషన్ తన సత్తా ఏంటే చాటి చెప్పాడు. ఇక, చాలా కాలం తరువాత కెప్టెన్ సూర్య కుమార్ బౌండరీ హద్దుగా చెలరేగాడు. దీంతో, ఈ రోజు జరుగుతున్న మూడో టీ20 లో తుది జట్టులో ఎలాంటి మార్పులకు అవకాశం ఉండదని తెలుస్తోంది. ఇవాళ(ఆదివారం) గువాహటి వేదికగా మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో గెలిచి.. సిరీస్‍ను కైవసం చేసుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్ తరువాత రెండు జట్లు విశాఖ చేరుకోనున్నాయి. టీ20 ప్రపంచ కప్ కు సమాయత్తం అవుతున్న సమయం లో కివీస్ తో ప్రస్తుతం జరుగుతున్న సిరీస్ కీలకంగా మారుతోంది. దీంతో.. ఇక విశాఖ వేదికగా క్రికెట్ ను ఆస్వాదించేందుకు ఫ్యాన్స్ సిద్దం అవుతున్నారు.

విశాఖ వేదికగా
విశాఖ పట్నం వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. దీనికి సంబంధించి రెండో దశ టికెట్లను ఇవాళ(ఆదివారం) సాయంత్రం 5 గంటలకు విక్రయాలు ప్రారంభం కానున్నాయి. డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేయవచ్చు. కనిష్టం ధర రూ.1,200 నుంచి గరిష్టంగా రూ.15,000 వరకు వివిధ డినామినేషన్లలో టికెట్లు అందు బాటు లో ఉంటాయని నిర్వాహకులు వెల్లడించారు. స్టేడియంలోని మొత్తం 18 స్టాండ్‌లతో పాటు కార్పొరేట్ బాక్స్ టికెట్లను కూడా ఈ విడతలో విక్రయించనున్నారు. వైజాగ్ స్టేడియం మొత్తం సామర్థ్యం 27,251. ఇప్పటికే ఈ నెల 23న జరిగిన తొలి దశ విక్రయాల్లో చాలా వరకు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. జనవరి 28న జరిగే నాలుగో మ్యాచ్ ఆడేందుకు భారత్, న్యూజిలాండ్ జట్లు ఈ నెల 26న విశాఖ చేరుకోనున్నాయి. 27న ఇరు జట్లు ఏసీఏ వీడీసీఏ స్టేడియంలోప్రాక్టీస్ చేయనున్నాయి. 28వ తేదీ రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. టీమిండియా బ్యాటర్ల బౌండరీ వర్షం ప్రత్యక్షంగా చూసేందుకు ఈ సారి విశాఖ మ్యాచ్ కు భారీ డిమాండ్ కనిపిస్తోంది. దీంతో.. అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఏసీఏ ప్రతినిధులు వెల్లడించారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications