India Vs Pakistan Match: మిస్టరీ స్పిన్నర్ ఎఫెక్ట్-టీమిండియాలో కీలక మార్పు..!
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ కొలంబోలో పాకిస్తాన్ తో జరిగే గ్రూప్ దశ మ్యాచ్ (india vs pakistan)కోసం భారత జట్టు పూర్తిగా సన్నద్ధమైంది. కొలంబోలో ఉన్న రికార్డుతో పాటు పాకిస్తాన్ పై వరల్డ్ కప్ టోర్నీల్లో ఉన్న రికార్డు భారత జట్టుకు కచ్చితంగా ఈ మ్యాచ్ కు ముందే ఎడ్జ్ ఇస్తున్నాయి. అయినా కీలక మ్యాచ్ లో ఎటువంటి రిస్క్ తీసుకునేందుకూ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సిద్దంగా లేడు. అందుకే ప్రత్యర్థి బలబలాలు, వ్యూహాలకు దీటుగా చివరి నిమిషాల్లో వ్యూహరచన చేస్తున్నాడు.
ప్రస్తుతం కొలంబోలో ఉన్న వాతావరణం, పిచ్ పరిస్ధితి, వర్షం పడితే మారే పరిస్ధితుల ఆధారంగా చూస్తే ఇరు జట్లూ పేస్ కంటే స్పిన్నర్లపైనే ఎక్కువగా ఆధారపడక తప్పని పరిస్ధితి. తాజాగా ఆస్ట్రేలియా-జింబాబ్వే జట్లు ఆడిన పిచ్ పైనే ఇవాళ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. దీంతో ఈ పిచ్ మరింత నెమ్మదిగా స్పందించే అవకాశాలున్నాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ రెగ్యులర్, పార్ట్ టైమర్లు కలిపి మొత్తం ఐదుగురు స్పిన్నర్లను బరిలోకి దించుతోంది. ఇందులో మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ ఒకడు. దీంతో భారత్ కూడా ఇద్దరు ప్రధాన పేసర్లలో ఒకరిని తప్పించి ఆ స్ధానంలో మూడో స్పిన్నర్ ను తీసుకోనుంది.

ప్రస్తుతం మెరుగైన ఫామ్ లోనే ఉన్న పేసర్ అర్ష్ దీప్ స్ధానంలో ఈ మ్యాచ్ కు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను తీసుకునేందుకు భారత్ సిద్దమైంది. వాస్తవానికి నిన్న ప్రెస్ మీట్ లోనే సూర్య ఈ విషయంపై దాదాపు క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇవాళ ఉదయం వరకూ కూడా పేసర్ అర్ష్ దీప్ ను ఆడించాలని భావించినా, చివరికి కుల్దీప్ యాదవ్ కే అవకాశం ఇస్తే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో తుది జట్టులో కుల్దీప్ తో పాటు వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ రూపంలో మరో ఇద్దరు ప్రధాన స్పిన్నర్లు ఉంటారు.












Click it and Unblock the Notifications