జింబాబ్వేతో మ్యాచ్ లో టీమిండియాలో కీలక మార్పులు, అభిషేక్ స్థానం- ఆ ఇద్దరు ఔట్..!!
T20 World cup India Vs Zimbabwe: ప్రపంచ కప్ లో ఇక టీమిండియా కు చావో రేవో అన్నట్లుగా పరిస్థితి మారింది. టీమిండియా, జింబాబ్వే జట్ల మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్ కు చెన్నై వేదికగా మారుతోంది. ఈ మ్యాచులో గెలుపు మాత్రమే కాదు.. రన్ రేటు లోనూ ఆధిపత్యం దక్కే విధంగా ఫలితం సాధించాలి. అప్పుడే సెమీస్ కు ఛాన్స్ ఉంటుంది. దీనికి ముందు జరిగే దక్షిణ ఆఫ్రికా - వెస్టిండీస్ మ్యాచ్ ఫలితం టీమిండియా పైన ప్రభావం చూపనుంది. దీంతో.. జింబాబ్వే మ్యాచ్ కోసం తుది జట్టులో కీలక మార్పులకు సిద్దమయ్యారు.
జింబాబ్వే ఆట తీరు గమనించిన ఇండియన్ టీం అవసరమైన వ్యూహాలు.. మార్పులతో సిద్దం అయింది. గత మ్యాచ్‌లో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ విఫలం కావడం జట్టును దెబ్బతీసింది. అటు బంతితో వికెట్లు తీయలేక, ఇటు బ్యాట్‌తో కేవలం 11 పరుగులు మాత్రమే చేసాడు. దీంతో నేటి మ్యాచ్‌లో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవడం దాదాపు ఖాయమైంది. ఫినిషర్ రోల్‌లో ఆశలు పెట్టుకున్న రింకు సింగ్ వరుసగా 6, 1, 11, 0 వంటి తక్కువ స్కోర్లకే పరిమితమయ్యాడు. అలాగే యువ ఆటగాళ్లు తిలక్ వర్మ, అభిషేక్ శర్మలు మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మార్చలేకపోతున్నారు. ఈ క్రమంలో టీమ్ మేనేజ్‌మెంట్ సంజూ శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. చెన్నైలోని నెమ్మదైన పిచ్‌పై స్పిన్నర్లను ఎదుర్కోవడంలో సంజూకు మంచి రికార్డ్ ఉంది. సంజూ - అభిషేక్ తో ఇన్నింగ్స్ ప్రారంభించి ఇషాన్, తిలక్ వర్మ, సూర్యకుమార్, శివం దుబే, హార్దిక్ పాండ్యాలతో బ్యాటింగ్ లైనప్ సిద్దం చేసింది.

సంజూ.. అక్షర్.. కుల్దీప్ కు తుది జట్టులో స్థానం
చెపాక్ పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామం అన్న సంగతి తెలిసిందే. దీంతో కుల్దీప్ యాదవ్‌ను ట్రంప్ కార్డ్‌గా వాడుకోవాలని మేనేజ్‌మెంట్ యోచిస్తోంది. కుల్దీప్ మాయాజాలంతో మధ్య ఓవర్లలో వికెట్లు తీస్తే జింబాబ్వేను తక్కువ స్కోరుకే కట్టడి చేయవచ్చని ప్లాన్ చేస్తున్నారు. అటు వరుణ్ చక్రవర్తి, ఇటు కుల్దీప్ ఇద్దరూ కలిస్తే లక్ష్యం పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో.. అర్షదీప్ స్థానంలో కుల్దీప్ కు ఛాన్స్ దక్కటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అటు జింబాబ్వేకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. దీంతో.. టీమిండియా తుది జట్టులో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శివం దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా కు ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications