బోణీ కొట్టిన భారత్: జపాన్ లో గ్రాండ్ ఓపెన్
జపాన్‌లోని నాగోయా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ లో భారత్ తన పతకాల ఖాతాను తెరిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో భారత షూటర్లు అత్యద్భుత ప్రదర్శను కనపర్చారు. దేశానికి తొలి రజత పతకాన్ని అందించారు. ఇలవేనిల్ వళరివన్, సోనమ్ మస్కర్, వినోద్ విదర్సాతో కూడిన భారత త్రయం ఈ ఘనత సాధించింది. దీంతో జపాన్ గేమ్స్ ప్రారంభంలోనే భారత్ క్యాంప్ లో జోష్ ఏర్పడింది.
ఈ కేటగిరీలో భారత షూటింగ్ టీమ్ సమష్టిగా రాణించింది. మొత్తం 1898 పాయింట్లతో రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఈ ఈవెంట్‌లో చైనా మొదటి స్థానంలో నిలిచింది. స్వర్ణ పతకాన్ని గురిపెట్టిందా డ్రాగన్ టీమ్. ఈ క్రీడలకు ఆతిథ్యాన్ని ఇస్తోన్న జపాన్ నాలుగో స్థానానికి పరిమితమైంది. మూడో స్థానం కోసం దక్షిణ కొరియా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఆ జట్టు ఇంకా రేసులోనే ఉంది. అయినప్పటికీ, భారత్ ఇప్పటికే పాయింట్ల పరంగా తన రజత పతకాన్ని సుస్థిరం చేసుకుంది.. భారత్.

వ్యక్తిగత విభాగంలోనూ భారత మహిళా షూటర్లు తమ ఆధిపత్యాన్ని స్పష్టంగా కనపర్చారు. ఇలావేనిల్ వళరివన్ షూటింగ్‌లో సత్తా చాటారు. 633.5 పాయింట్లను స్కోర్ చేశారు. దీంతో మొదటి ఎనిమిది మందిలో నిలిచి, వ్యక్తిగత ఫైనల్స్‌కు అర్హత సాధించారు. ఆమెతో పాటు సోనమ్ మస్కర్ కూడా అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఫైనల్ పోరుకు అర్హత సాధించడం దేశానికి మరింత గర్వకారణంగా నిలిచింది.
ఆసియా క్రీడల్లో భారత షూటింగ్ అథ్లెట్లకు ఉన్న ఘనమైన చరిత్ర ఈ రజత విజయంతో మరోసారి నిరూపితమైంది. క్రీడల ప్రారంభంలోనే మహిళలు తమ ఒత్తిడిని అధిగమించి సాధించిన విజయాలు భారత క్యాంప్ లో నూతనోత్సేహాన్ని ఇచ్చినట్టయింది. ఈ రజత పతకం అందించిన ఉత్సాహం రాబోయే రోజుల్లో ఇతర విభాగాల్లో తలపడే భారతీయులలో అసమానమైన పోటీతత్వాన్ని నింపడంలో కీలక పాత్ర పోషిస్తుందనడంలో సందేహాలు అక్కర్లేదు.












Click it and Unblock the Notifications
