దేశంలోనే తొలిసారి ఏపీ నుండే.. రైళ్ళలో కలపగుజ్జు రవాణా!
భారతీయ రైల్వే సరుకు రవాణాలో కూడా సంచలనాల నమోదుకు రెడీ అయింది. అందులో భాగంగా కాకినాడ పోర్టు నుంచి దేశంలోనే తొలిసారిగా కలప గుజ్జుతో ఒక ప్రత్యేక రైలు బయలుదేరింది. దేశంలో ఇప్పటివరకు ఎవరూ రైలులో రవాణా చేయని వుడ్ పల్ప్ కాకినాడ పోర్ట్ నుండి మహారాష్ట్రలోని భిగ్వాన్ లో ఉన్న కాగిత పరిశ్రమలకు ఇది చేరుకుంటుంది.
కాకినాడ పోర్ట్ కు వచ్చే ఈ కలప గుజ్జు పదిహేనేళ్లుగా మార్గంలోనే వెళ్తూ ఉండేది. కాకినాడ నుంచి దాదాపు వెయ్యి అరవై ఒకటి కిలోమీటర్ల దూరం కలప గుజ్జును ట్రక్కుల్లో తీసుకెళ్లేవారు. అయితే ఈ విషయం గుర్తించిన రైల్వే అధికారులు రోడ్డు బదులు రైలు మార్గం వాడితే తమకు అదనపు ఆదాయం వస్తుందని గ్రహించారు. పరిశ్రమల ప్రతినిధులతో మాట్లాడారు.

అయితే రైళ్ళ ద్వారా సరుకు రవాణా చేయటానికి వారికి ఒక సమస్య ఉంది. వాగన్‌లో నిజానికి నలభై ఐదు నుంచి యాభై టన్నులు మాత్రమే లోడ్ చేయగలిగేవారు. అయినా రైల్వే అరవై ఐదు టన్నులకు ఛార్జీలు వేసేది. దాంతో ఖర్చు ఎక్కువైపోయి పరిశ్రమలు రోడ్డు మార్గాల ద్వారా రవాణా చెయ్యాలని చూసేవి. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఈ ఏడాది జూలైలో రైల్వే అధికారులు కొత్త ప్రతిపాదన పెట్టారు.
కలప గుజ్జును గూడ్స్ టారిఫ్ క్లాస్-110 కింద చేర్చాలని రైల్వే బోర్డుకు సిఫారసు చేశారు. ఆ ప్రతిపాదన ఆమోదం పొందింది. దీంతో ఛార్జీలు గణనీయంగా తగ్గాయి. ఫలితంగా పరిశ్రమలు ఇప్పుడు రైలు రవాణాకే మొగ్గు చూపుతున్నాయి. ఒక్క రేక్ వస్తే రైల్వేకు సుమారు నలభై లక్షల రూపాయలు ఆదాయం వస్తుందని అంచనా. ఏడాదికి ఒకటిన్నర లక్షల టన్నుల అదనపు లోడింగ్ జరిగితే ఇరవై కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఈ మొదటి రైలు బయలుదేరడాన్ని దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్, ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ వినీత్ కుమార్తదితరులు అభినందించారు. రోడ్డు రవాణా కంటే రైలు మార్గం ఖర్చు తక్కువ అవుతుందని భావిస్తున్నారు. సమయం ఆదా అవుతుందని, రోడ్డు రవాణా కాకుండా రైలు ద్వారా రవాణా కావటంతో పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పుడు ఈ మార్పు మొదలైంది. కాకినాడ పోర్టు నుంచి బయలుదేరిన ఈ రైలు కేవలం ఒక సరకు రవాణా కాదు. రైల్వే చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది.












Click it and Unblock the Notifications
