బీసీసీఐ రూల్స్ బ్రేక్.. రాజస్థాన్ రాయల్స్‌కు చిక్కులు!

ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ అనూహ్య వివాదం చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు అద్భుత విజయం సాధించినప్పటికీ.. డగౌట్లో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమీ భిందర్ నిబంధనలకు విరుద్ధంగా మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ కెమెరాకు చిక్కడం బీసీసీఐ వర్గాల్లో కలకలం రేపుతోంది.

డగౌట్‌లో మొబైల్ వినియోగం.. నిబంధనల ఉల్లంఘన!
గౌహతిలోని బర్సపార స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండగా.. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ పక్కనే కూర్చున్న మేనేజర్ రోమీ భిందర్ తన ఫోన్ వాడుతూ కనిపించారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. మ్యాచ్ జరుగుతున్న సమయంలో 'ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా'లో ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడం పూర్తిగా నిషేధం. టీమ్ మేనేజర్‌కు ఫోన్ వాడేందుకు కొంత మినహాయింపు ఉన్నప్పటికీ.. అది కేవలం డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితం. డగౌట్‌లో కూర్చుని ఫోన్ వాడటం నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

IPL 2026 Rajasthan Royals Manager Romi Bhinder Caught Using Phone in Dugout BCCI Investigation Expected

యాంటీ కరప్షన్ యూనిట్ నిఘా.. చర్యలు తప్పవా?
లైవ్ మ్యాచ్ సమయంలో బయటి వ్యక్తులతో కమ్యూనికేట్ చేయకుండా ఉండేందుకు బీసీసీఐ ఈ కఠినమైన రూల్స్ అమలు చేస్తోంది. రోమీ భిందర్ చేసిన ఈ పనిపై మ్యాచ్ రెఫరీ లేదా యాంటీ కరప్షన్ యూనిట్ (ఏసీయూ) విచారణ జరిపే అవకాశం ఉంది. ఒకవేళ ఇది నిబంధనల ఉల్లంఘన అని తేలితే.. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు భారీ జరిమానా విధించడమో లేదా హెచ్చరిక జారీ చేయడమో జరుగుతుంది. సోషల్ మీడియాలో కూడా ఈ ఫోటో వైరల్ కావడంతో క్రికెట్ అభిమానులు బీసీసీఐ వివరణ కోరుతున్నారు.

మ్యాచ్ పరిస్థితి ఇలా..
ఈ వివాదం పక్కన పెడితే.. మైదానంలో రాజస్థాన్ రాయల్స్ అదిరిపోయే ప్రదర్శన చేసింది. ఆర్సీబీ నిర్దేశించిన 202 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ కేవలం 18 ఓవర్లలోనే ఛేదించింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 26 బంతుల్లోనే 78 పరుగులు చేసి మెరుపులు మెరిపించగా.. ధ్రువ్ జురేల్ 81 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో రాజస్థాన్ రాయల్స్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఓ వైపు వరుస విజయాలతో రాజస్థాన్ దూసుకుపోతుంటే.. మరోవైపు మేనేజర్ చేసిన ఈ చిన్న పొరపాటు జట్టు ప్రతిష్టకు కొంత ఇబ్బందిగా మారింది. ఈ విషయంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+