IPL 2024 డిసైడర్: ప్లేఆఫ్ స్పాట్ కోసం RCB మరియు CSK ఈక్వేషన్స్ ఇవే..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 ప్లేఆఫ్‌లలో నాల్గవ స్థానం కోసం పోటీ పెరుగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), చెన్నై సూపర్ కింగ్స్ (CSK), మరియు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఆ గౌరవనీయమైన స్థానం కోసం పోటీ పడుతున్నాయి. లక్నో సూపర్ జైంట్స్ నెట్ రన్ రేట్ కారణంగా ఆ జట్టు దాదాపుగా ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించింది. దీంతో అసలైన పోటీ RCB మరియు CSK మధ్య ఉంది. శనివారం జరిగే కీలకమైన మ్యాచ్‌లో వారు ఒకరినొకరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు.
CSK, 14 పాయింట్లు మరియు +0.528 ఉన్నతమైన NRRతో ముందంజలో ఉండగా.. RCBతో జరగబోయే మ్యాచ్ వాతావరణ పరిస్థితుల కారణంగా రద్దు అయితే రెండు జట్లకు చెరోపాయింట్ లభిస్తుంది. దీంతో RCB, 13 పాయింట్లతో నిలుస్తుంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 15 పాయింట్లతో ఉంటుంది. కానీ ఆర్సీబీ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై భారీ విజయాన్ని సాధించి నెట్ రన్ రేట్ మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది.

ప్లేఆఫ్ అవకాశాలుRCB ముందుగా బ్యాటింగ్ చేస్తే 200 పరుగులు చేయాల్సి ఉంటుంది. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ పై కనీసం 18 పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది.ఒకవేళ చెన్నై సూపర్ కింగ్స్ ముందు బ్యాటింగ్ చేసి 200 పరుగులు చేస్తే అనంతరం బ్యాటింగ్‌కు దిగే బెంగళూరు జట్టు కనీసం 11 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించాల్సి ఉంటుంది.
అయితే ఇటు ఆర్సీబీ కానీ అటు సీఎస్కే కానీ ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించాలంటే మరో ఈక్వేషన్ ఉంది. అయితే ఈ లెక్క వాస్తవం అవ్వాలంటే అత్యద్భుతం జరిగాల్సి ఉంటుంది. ముంబై ఇండియన్స్ లక్నో జట్ల మధ్య శుక్రవారం జరిగే చివరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జైంట్స్ కనుక భారీ తేడాతో విజయం సాధించి వారి నెట్ రన్ రేట్‌ను ఆర్సీబీ నెట్ రన్ రేట్ కంటే మెరుగ్గా ఉంచగలిగితే ప్లేఆఫ్స్‌కు వెళ్లే మార్గం సరళతరం అవుతుంది. కానీ ఇది ఎటు చూసినా సాధ్యపడే అంశంలా కనిపించడం లేదు.
వీరి మ్యాచ్ తర్వాత కేఎల్ రాహుల్ లక్నో టీమ్ చెన్నై బెంగళూరు మ్యాచ్‌పై ఫోకస్ చేస్తుంది. బెంగళూరు జట్టు సీఎస్‌కే పై గెలవాలని కోరుకుంటుంది. ఆ గెలుపు కూడా స్వల్ప తేడాతోనే ఉండాలని బలంగా కోరుకుంటోంది. అయితే అంతకంటే ముందు ముంబైపై లక్నో జట్టు అత్యంత భారీ తేడాతో విజయం సాధిస్తేనే ఈ ఈ క్వేషన్స్ గురించి ఆలోచించొచ్చు.
మొత్తానికి ఐపీఎల్ 2024 సీజన్ ప్లే ఆఫ్స్ రేస్ చాలా ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే సన్ రైజర్స్ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకోగా.. ఇక చివరి స్థానం కోసం పలు జట్లు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం జరిగే ఆర్సీబీ చెన్నైల మధ్య జరిగే మ్యాచ్ పైనే అందరి దృష్టి ఉంది.












Click it and Unblock the Notifications