భారత దిగ్గజాలను చూసి నేర్చుకోండి.. సిగ్గుండాలి మీకు! నటి ఫైర్!!

భారత మహిళల క్రికెట్ జట్టు చిరకాల స్వప్నం ఎట్టకేలకు నెరవేరింది. మూడోసారి వరల్డ్ కప్ ఫైనల్‌కు దూసుకెళ్లిన మహిళా జట్టు ఎట్టకేలకు కప్ ను ఒడిసి పట్టుకుంది. కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షను నెరవేరుస్తూ బలమైన దక్షిణాఫ్రికాను ఓడించి విశ్వ విజేతగా నిలిచారు. ఈ చారిత్రక విజయం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు మహిళల జట్టును ప్రశంసలతో ముంచెత్తారు. అదే సమయంలో, ఫైనల్‌లో రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా మహిళల టీమ్ పోరాటాన్ని కూడా ప్రపంచం కొనియాడింది.

సొంత దేశంలో మద్దతు కరువు: దక్షిణాఫ్రికా నటి ఆవేదన
అయితే తమ టీమ్ ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలవడంతో దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ నటి, రచయిత్రి తంజా వుర్ తీవ్రంగా స్పందించింది. ఆమె విజేతగా నిలిచిన భారత మహిళల టీమ్‌ను ప్రశంసించడంతో పాటు తన సొంత దేశంలోని పురుష క్రికెటర్లు, ప్రజలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. తంజా వుర్ తన ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా తన ఆవేదన వ్యక్తం చేస్తూ.. భారతీయ అభిమానులు క్రీడల పట్ల చూపిస్తున్న ప్రేమ, మద్దతు తమ దేశపు మహిళా క్రికెట్ జట్టుకు ఎందుకు లభించడం లేదని ప్రశ్నించింది. భారతీయులు చూపించిన ప్రేమ, మద్దతు... మన మహిళా క్రికెట్ జట్టుకు సౌతాఫ్రికన్స్ సపోర్ట్ ఇవ్వకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది.

Learn from India Legends Shame on You South African Actress Curt Call to Her Mens Team

మీకు ఈ మ్యాచ్ అంత ముఖ్యం కాదా?
తంజా వుర్ తన విమర్శలకు ప్రధాన కారణంగా పురుష క్రికెట్ దిగ్గజాల మద్దతు లేకపోవడాన్ని చూపించింది. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత దిగ్గజ క్రికెటర్లు - సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, వీవీఎస్ లక్ష్మణ్ - స్టేడియానికి వచ్చి, మహిళా క్రికెటర్లను ఉత్సాహపరిచిన విధానాన్ని ఆమె కొనియాడింది. "మరి దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్స్ ఎక్కడ?" అని నటి నిలదీసింది. జాక్వస్ కల్లిస్, ఏబీ డివిలియర్స్, గ్రేమ్ స్మిత్ లాంటి దిగ్గజాలెవరూ కూడా ఫైనల్ మ్యాచ్‌కు హాజరు కాకపోవడంపై ఆమె మండిపడింది. దక్షిణాఫ్రికా పురుష క్రికెటర్లను ఉద్దేశించి ఘాటుగా విమర్శిస్తూ.. "ఎందుకంటే మీకు ఈ మ్యాచ్ అంత ముఖ్యం కాకపోవచ్చు," అని నటి తంజా వుర్ వ్యాఖ్యానించింది.

క్రీడా మంత్రిపై కూడా ఆగ్రహం
పురుష క్రికెటర్లతో పాటు ఆమె తన దేశ క్రీడా మంత్రి కూడా ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హాజరు కాకపోవడంపై తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది. మహిళల క్రీడల పట్ల తన దేశం ఈ నిర్లక్ష్య వైఖరిని ఆమె సోషల్ మీడియా వేదికగా ఎండగట్టింది. ఫైనల్‌లో ఓటమి పాలైనప్పటికీ తంజా వుర్ భారత జట్టు పోరాటాన్ని, ఆటతీరును ప్రశంసించింది. ముఖ్యంగా స్మృతి మంధాన సహా భారత మహిళా క్రికెటర్స్ చాలా బాగా ఆడారని కొనియాడింది. "భారతీయ అభిమానుల నమ్మకం టీమిండియాకు బాగా కలిసొచ్చింది. ఏది ఏమైనా ఈ రోజు మీరు ఈ ప్రపంచ కప్ విజేతలు... మీరు దానికి అర్హులు," అంటూ టీమిండియాకు అభినందనలు తెలిపింది. తంజా వుర్ విడుదల చేసిన ఈ వీడియో, మహిళా క్రీడలకు మద్దతు కరువవుతున్న అంశాన్ని, దేశం గర్వించే క్షణాల్లో కూడా తమ దిగ్గజాలు, అధికారులు క్రీడాకారులను ప్రోత్సహించడానికి ముందుకు రాకపోవడం ఎంత బాధాకరమో వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+