Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏమిరా బాలరాజు నీ వల్ల ఉపయోగం

LSG vs PBKS: ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ దూకుడు కంటిన్యూ అవుతోంది. వరుసగా రెండో విజయాన్ని అందుకుందా జట్టు. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లల్లో రెండు విజయాలతో మొత్తం నాలుగు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.

ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది పంజాబ్ కింగ్స్. ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్‌ను మట్టికరిపించింది. మంగళవారం రాత్రి లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏక్నా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో విజయదుందుభి మోగించింది.

LSG vs PBKS After KL Rahul LSG Owner Goenka spotted confronts Rishabh Pant during IPL 2025

తొలుత బ్యాటింగ్‌కు దిగిన లోకల్ టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. నికొలస్ పూరన్ టాప్ స్కోరర్. 44 పరుగులతో అదరగొట్టాడు. మిడిలార్డర్ బ్యాటర్ ఆయుష్ బదోనీ 30 బంతుల్లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 41, చివర్లో అబ్దుల్ సమద్ 12 బంతుల్లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 27 పరుగులతో మెరుపు ఇన్నింగ్ ఆడాడు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ ఈ స్కోర్‌ను ఊదిపడేసింది. ఆడుతూ పాడుతూ విజయాన్ని అందుకుంది. మూడో ఓవర్‌లోనే ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య వికెట్ కోల్పోయినప్పటికీ- పెద్దగా ఒత్తిడికి గురి కాలేదా జట్టు. మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్- 69, కేప్టెన్ శ్రేయాస్ అయ్యర్- 52 (నాటౌట్), నేహల్ వాధ్వా- 43 (నాటౌట్) పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చారు.

16.2 ఓవర్లల్లో రెండు వికెట్ల నష్టానికి 177 పరుగులతో విజయాన్ని అందుకుంది పంజాబ్ కింగ్స్. ఈ గెలుపుతో పంజాబ్ కింగ్స్ నెట్ రన్‌రేట్‌ను భారీగా మెరుగుపడింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ పొజీషన్‌లో కొనసాగుతోంది.

ఈ మ్యాచ్‌లో కూడా విఫలం అయ్యాడు కేప్టెన్ రిషభ్ పంత్. ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. అయిదే బంతులను ఎదుర్కొన్నాడీ వికెట్ కీపర్ బ్యాటర్. రెండు పరుగులే చేశాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల బౌలింగ్‌లో యుజ్వేంద్ర చాహల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకుముందు ఢిల్లీ కేపిటల్స్‌పై డకౌట్. ఆ తరువాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 పరుగులకే పరిమితం అయ్యాడు.

ఇది- లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీ ఓనర్ సంజీవ్ గోయెంకాకు ఆగ్రహానికి గురి చేసినట్టయింది. రిషభ్ పంత్‌ను మందలించడం కనిపించింది. పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గోయెంకా.. పంత్ వద్ద నిల్చుని వేలెత్తి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గత సీజన్‌లో అప్పటి కేప్టెన్ కేఎల్ రాహుల్‌తోనూ ఇలాగే బిహేవ్ చేశారాయన.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+