5 వికెట్లతో ఆస్ట్రేలియా నడ్డి విరిచిన స్టార్ ఆల్ రౌండర్: 99 పరుగులకే ఆలౌట్

సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ నడ్డి విరిగింది. ప్రోటీస్ పేసర్ల సమిష్టి ధాటికి తాళలేక మొదటి ఇన్నింగ్స్‌లో 99 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికా బౌలర్లు మ్యాచ్‌పై పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించడంతో ఆసీస్ పకడ్బందీ ప్రణాళికలు పూర్తిగా విఫలమయ్యాయి. ఫాలో ఆన్ ఆరంభించిన ఆస్ట్రేలియాకు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది కూడా. ఫాలో ఆన్ ఇన్నింగ్ లో 11 పరుగులకు ఒక వికెట్ నష్టపోయింది.

ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైన్ అప్‌ను దక్షిణాఫ్రికా పేసర్లు ఆరంభం నుంచే దెబ్బతీశారు. జట్టులో సీనియర్ బ్యాటర్ స్టీవెన్ స్మిత్ ఒక్కడే కాస్త సహనంతో ఆడి 88 బంతుల్లో 28 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. స్టార్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్- 14, మార్నస్ లబుషేన్- 14, మ్యాట్ రెన్షా- 12, బ్యూ వెబ్‌స్టర్- 13 పరుగులు చేశారు. ఓపెనర్ నిక్ మ్యాడిన్సన్, వికెట్ కీపర్ అలెక్స్ కేరీ ఇద్దరూ ఖాతా తెరవకుండానే సున్నా పరుగులకే వెనుతిరిగారు.

Marco Jansen 5 and Kagiso Rabada Destroye Australia Batting Order bowled out for 99 vs South Africa

దక్షిణాఫ్రికా బౌలింగ్ విభాగంలో స్టార్ ఆల్‌రౌండర్ మార్కో జెన్ సెన్ అయిదు వికెట్లతో తడాఖా చూపాడు. పదునైన స్వింగ్, అదనపు బౌన్స్‌తో ఆసీస్ బ్యాటర్లను భయపెట్టాడు. నిఖార్సయిన ఆల్ రౌండర్ గా రాణించాడీ మ్యాచ్ లో మార్కో. బ్యాటింగ్ లో 85 పరుగులు చేశాడు. బౌలింగ్ లో అయిదు వికెట్లు కూల్చాడు. మరో ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడా- 2, వియాన్ ముల్డర్- 2 వికెట్లు సాధించారు. ఎన్రిచ్ నోర్జే ఒక వికెట్ దక్కించుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా 42.3 ఓవర్లలో 99 పరుగులకు చాప చుట్టేసింది.

ఆస్ట్రేలియాపై సెంచరీతో తడాఖా చూపిన బావుమా
ఆస్ట్రేలియాపై సెంచరీతో తడాఖా చూపిన బావుమా

ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్- 7, మిచెల్ స్టార్క్- 1, స్కాట్ బోలాండ్- 2 పరుగులు మాత్రమే చేశారు. రెండో టెస్టు నాలుగో రోజు రెండో సెషన్ సమయానికి ఆస్ట్రేలియా జట్టు ఇంకా 316 పరుగుల భారీ వెనుకంజలో ఉండిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా సాధించిన భారీ ఆధిక్యంతో ఈ మ్యాచ్‌లో పూర్తి విజయావకాశాలను సొంతం చేసుకునే దిశగా సాగుతోంది. సెయింట్ జార్జ్ పార్క్ పిచ్ బౌలింగ్‌కు అనుకూలిస్తుండటంతో దక్షిణాఫ్రికా బౌలర్లను ఎదుర్కోవడం ఆస్ట్రేలియా బ్యాటర్లకు సవాల్ గా మారింది.

మైదానంలో పరిస్థితులు కూడా ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉన్నాయి. ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో ఏమాత్రం పోటీ ఇవ్వాలన్నా తమ ద్వితీయ ఇన్నింగ్స్‌లో అసాధారణ పోరాటం చేసి పెద్ద స్కోరు సాధించాల్సి ఉంటుంది. మొదటి ఇన్నింగ్ లో దక్షిణాఫ్రికా 9 వికెట్లకు 425 పరుగులు చేసి ఇన్నింగ్ డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. కేప్టెన్ టెంబా బావుమా 179 పరుగులతో చెలరేగాడు. అతనికి మార్కొ జెన్ సెన్- 85, సైమన్ హార్మర్- 82 నుంచి చక్కటి సహకారం లభించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+