వారం రోజులుగా టికెట్ ముక్క దొరకట్లేదు.. ఇదేం సినిమారా బాబోయ్..!

సూపర్ స్టార్ రజనీకాంత్- దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో వచ్చిన జైలర్ 2 మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే. 2023 లో వచ్చిన జైలర్ సినిమాకు కొనసాగింపుగా ఈ మూవీ తెరకెక్కింది. దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ అక్టోబర్ 16న విడుదలైంది. ఫస్ట్ డే నుంచే జైలర్ 2 మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. వారం రోజులుగా కలెక్షన్స్ లో ఏమాత్రం డ్రాప్ కనిపించడం లేదు. అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. జైలర్ 2 మూవీ ఆరో రోజు భారత్ లో ఏకంగా రూ. 45.55 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది. దాంతో ఇండియా వైడ్ గా నెట్ కలెక్షన్ రూ. 287.80 కోట్ల వరకు చేరుకున్నట్లు స్పష్టం అవుతోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ అయిన ఆరు రోజుల్లోనే రూ. 541 కోట్లకు చేరుకుని తిరుగులేని విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద సూపర్ స్టార్ రజనీకాంత్ స్టామినా ఏంటో నిరూపించింది. అటు తెలుగులోనూ ఈ మూవీ రూ. 8 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.

జైలర్ 2 మూవీ అన్ని భాషల కంటే తమిళంలో సంచలన వసూళ్లతో దూసుకెళ్తోంది. 75 ఏళ్ల వయసులోనూ సూపర్ స్టార్ రజనీకాంత్ స్క్రీన్ ప్రజెన్స్ ను చూసి జెన్ జీ యువత ఈలలు, కేరింతలతో థియేటర్లు హోరెత్తుతున్నాయి. అటు నెల్సన్ అద్భుతమైన టేకింగ్.. అనిరుధ్ బీజీఎంతో సినిమాలోని ఎలివేషన్ సీన్స్ కు థియేటర్లలోని సీట్లలో ఎవరూ కూర్చోవడం లేదు. ఇక ఈ చిత్రం రానున్న రోజుల్లో రూ. 1000 కోట్ల క్లబ్ లోకి చేరడం పెద్ద కష్టమేమీ కాదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే జరిగితే కోలీవుడ్ చరిత్రలో తొలిసారి రూ. 1000 కోట్ల కలెక్షన్స్ సాధించిన సినిమాగా జైలర్ 2 నిలిచే అవకాశం కనిపిస్తోంది.

Jailer2 Superstar Rajinikanth shows not slowing down box office over Rs 45 crore on its sixth day

ఇక జైలర్ 2 చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జైలర్ 2 చిత్రానికి రూ. 250 కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు అయినట్లు తెలుస్తోంది. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ సినిమాకు రెమ్యూనరేషన్ గా రూ. 110 కోట్లు తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. అలాగే మూవీ టాక్ ను బట్టి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటే ఈ మూవీ ప్రాఫిట్స్ ను కూడా రజనీ అందుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ లెక్కన చూస్తే రజనీకాంత్ కు రూ. 180 కోట్ల వరకు రెమ్యూనరేషన్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+