మిక్స్‌డ్ టాక్‌తోనూ తగ్గేదేలే.. బాక్సాఫీస్ వద్ద ‘రణబాలి’ రికార్డుల మోత!

ప్రముఖ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన చిత్రం 'రణబాలి'. 1870లలో మద్రాస్ ప్రెసిడెన్సీలో సంభవించిన కరువు, ఆ సమయంలో బ్రిటీష్ వారి దారుణాలు ఇతర అంశాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. దసరా కానుకగా అక్టోబర్ 16న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకెళ్తోంది.

'జైలర్ 2' లో రజనీకాంత్ తో నటించిన చిన్నారి రిత్విక్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
'జైలర్ 2' లో రజనీకాంత్ తో నటించిన చిన్నారి రిత్విక్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

దసరా సెలవుల ప్రభావం, హౌస్‌ఫుల్ బోర్డులు
పండుగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజున కొద్దిగా మిక్స్‌డ్ టాక్ లభించింది. అయినప్పటికీ ఈ మిశ్రమ స్పందన ఎఫెక్ట్ కలెక్షన్లపై ఏ మాత్రం పడలేదు. విజయ్ దేవరకొండ, రష్మికల స్టార్‌డమ్, ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణతో సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి దసరా పండుగ సీజన్ చాలా బాగా కలిసొచ్చింది. ముఖ్యంగా మంగళవారం దసరా పండగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో 'రణబాలి'కి హౌస్‌ఫుల్ కలెక్షన్లు నమోదయ్యాయి. రిలీజ్ రోజున టాక్ ఎలా ఉన్నప్పటికీ.. పండగ సెలవులు కలిసిరావడం, విజయ్-రష్మికల క్రేజ్ కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ల బాట పట్టడంతో వసూళ్లు భారీగా పెరిగాయి.

Ranabaali Movie Box Office Collections Vijay Deverakonda Movie Races Towards Break-Even Details

బ్రేక్ ఈవెన్ దిశగా అడుగులు
వ్యాపార వర్గాల అంచనా ప్రకారం.. 'రణబాలి' చిత్రం ఇప్పటికే తన ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో దాదాపు 70 శాతం రికవరీ సాధించింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని లాభాల బాటలోకి అడుగుపెట్టినట్లు సమాచారం. ఇదే జోరు రాబోయే రోజుల్లో కూడా కొనసాగితే ఈ వారంలోనే మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ అవుతుందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు.

విజయ్ దేవరకొండ 'రణబాలి' మూవీకి షాకింగ్ కలెక్షన్స్.. వివరాలు ఇవే..!
విజయ్ దేవరకొండ 'రణబాలి' మూవీకి షాకింగ్ కలెక్షన్స్.. వివరాలు ఇవే..!

ప్రమోషన్ల పాత్ర, ప్రచార వ్యూహం
'రణబాలి' ఓ చారిత్రక కథాంశంతో తెరకెక్కడంతో ఈ జానర్‌ను ప్రేక్షకులకు సరిగ్గా అర్థం చేయించేందుకు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇలాంటి చారిత్రక కథలు అరుదుగా వస్తాయని, మన చరిత్రలోని ఓ ముఖ్యమైన భాగాన్ని అందరికీ చేరవేయాలనే ఉద్దేశంతో వారు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రమోట్ చేశారు. ఈ ప్రచారమే ప్రేక్షకులలో సినిమాపై ఆసక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషించిందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

మిక్స్‌డ్ టాక్ ఉన్నప్పటికీ.. 'రణబాలి' ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు రూ.55 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను సాధించినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. మొత్తానికి స్టార్ హీరోల క్రేజ్, పండగ సెలవులు ఈ సినిమాకు శ్రీరామరక్షగా నిలిచాయి. రానున్న రోజుల్లో ఈ చిత్రం లాభాల బాటలో ఎంతవరకు నిలదొక్కుకుంటుందనేది ఉత్కంఠగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+