కాయదు లోహర్ తాగిన వాటర్ బాటిల్ అమ్మకానికి.. ధర ఎన్ని లక్షలో తెలుసా?
భారతదేశంలో సినీతారలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారిని దేవుళ్లలా గుడికట్టి పూజిస్తారు అభిమానులు. తమ ఫేవరెట్ స్టార్స్ పుట్టినరోజులు, సినిమా విడుదల సమయంలో పండుగ చేస్తుంటారు అభిమానులు. తమ అభిమాన నటుడిని లేదా నటిని జీవితంలో ఒక్కసారైనా చూడాలని అనుకునేవారు, వారితో ఫోటో దిగాలని అనుకునేవారు, ఆటోగ్రాఫ్ తీసుకోవాలని తహతహలాడేవారు ఎందరో. ప్రేక్షకుల్లో ఉన్న ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి కొందరు ప్రయత్నిస్తుంటారు. తాజాగా యంగ్ బ్యూటీ కాయదు లోహర్ విషయంలో ఇదే జరిగింది. ఈ వివరాల్లోకి వెళితే..
పుణేలో స్థిరపడిన అస్సాం ముద్దుగుమ్మ కాయదు లోహర్. మోడలింగ్ నుంచి నటిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. టఫ్ కాంపిటీషన్ ఉండే ఈ ఇండస్ట్రీలో తన అందం, క్యూట్ లుక్స్‌తో గుర్తింపు తెచ్చుకుంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి ఆమె వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మలయాళంలో పతోన్ పతమ్ నూట్టండులో నటనకు గాను మంచి గుర్తింపు వచ్చింది. కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు హీరోగా వచ్చిన అల్లూరి మూవీతో కాయదు లోహర్ తెలుగువారిని పలకరించింది. ఇందులో తన పరువాలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది. సినిమా డిజాస్టర్‌గా నిలిచినప్పటికీ కాయదు అందాలకు మంచి మార్కులు పడ్డాయి.

కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ సరసన నటించిన రిటర్న్ ఆఫ్ డ్రాగన్ ఆమెను ఓవర్‌నైట్ స్టార్ హీరోయిన్‌ని చేసింది. ఈ సినిమా దెబ్బకు వరుస అవకాశాలు కాయదు లోహర్ ముంగిట క్యూకట్టాయి. ఇటీవల తెలుగులో నేచురల్ స్టార్ నాని సరసన ది ప్యారడైజ్‌లో నటించి అలరించారు కాయదు. చేసిన సినిమాలలో ఎక్కువ భాగం ఫ్లాప్స్ ఉన్నప్పటికీ ఆమెకు మాత్రం అవకాశాలు క్యూకడుతున్నాయి. ప్రస్తుతం తమిళంలో మంజనాత్తి, సూర్య హీరోగా నటిస్తోన్న 48వ సినిమాలలో కాయదు నటిస్తున్నారు. అలాగే మలయాళంలో థారం అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇవి కాకుండా మరిన్ని ప్రాజెక్ట్‌లు చర్చల దశలలో ఉన్నాయి. అలా దక్షిణాదిలో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్‌గా దూసుకెళ్తున్నారు కాయదు లోహర్.
ఇదిలాఉండగా.. స్టార్స్‌కు అభిమానుల్లో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని కొందరు వ్యక్తులు వారు వాడిన వస్తువులను వేలం వేయడం, విక్రయించడం లాంటివి చేస్తుంటారు. తాజాగా కాయదు లోహర్ విషయంలోనూ ఓ వ్యక్తి తుంటరి పని చేసి ఆమెను వార్తల్లోకి తీసుకొచ్చాడు. కాయదు లోహర్ తాగిన వాటర్ బాటిల్‌ని ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి పెట్టాడు. అంతేకాదు.. ఈ బాటిల్ ధరను 3 లక్షల రూపాయలుగా నిర్ణయించాడు. కాయదు మంచి నీరు తాగుతున్న ఆ ఫోటోను పెట్టి తన బిజినెస్ ప్రమోట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దీనిపై రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. మరి దీనిపై కాయదు లోహర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications
