క్రికెట్ ఆడటం రాకపోయినా ఓవరాక్షన్ చేయడంలో మాస్టర్ డిగ్రీ!

IND vs PAK: ఆసియా కప్ 2025లో భాగంగా సూపర్-4లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ క్రికెటర్ హారిస్ రౌఫ్ తన దిగజారుడు ప్రవర్తనతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓటమి అంచున ఉన్నప్పటికీ.. పాక్ బౌలర్ హారిస్ రౌఫ్ భారత అభిమానులను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తూ ఒక వివాదాస్పద సైగ చేశాడు. ఈ సంఘటన పాక్ క్రికెటర్ల క్రీడాస్ఫూర్తిని, వారి అహంకారపూరిత వైఖరిని మరోసారి బయటపెట్టింది.

హారిస్ రౌఫ్ దిగజారుడు ప్రవర్తన
పాకిస్తాన్ పేసర్ హారిస్ రౌఫ్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు భారతీయ అభిమానులకు ఒక అగౌరవకరమైన సైగ చేశాడు. తన చేతితో ఒక జెట్ విమానం కూలిపోతున్నట్లు చూపిస్తూ, 'ఆపరేషన్ సింధూర్' సమయంలో పాకిస్తాన్ భారత రఫేల్ జెట్లను కూల్చివేసిందనే అబద్ధపు ప్రచారాన్ని సూచించాడు. ఈ అబద్ధపు వాదన ఇప్పటికే నిరూపితమైంది. కానీ హారిస్ రౌఫ్ ఆ తప్పుడు సమాచారాన్ని ఉపయోగించి భారత అభిమానులను అవమానించడానికి ప్రయత్నించాడు. ఈ చర్య ఒక క్రికెటర్‌గా అతని గౌరవాన్ని దెబ్బతీసి, అతన్ని ఒక నీచమైన ట్రోల్‌గా మార్చింది. పాకిస్తాన్ ఆటగాళ్లు తరచుగా ఇలాంటి చౌకబారు నాటకాలకు పాల్పడుతుంటారని దీంతో మరోసారి నిరూపితమైంది. అయితే నిజానికి ఆ ఆపరేషన్‌లో భారత సైనికులు పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు. ఈ అబద్ధపు ప్రచారం చేసి అహంకారంతో ప్రవర్తించిన హారిస్ రౌఫ్‌ను భారత అభిమానులు ఆటపట్టించడం మొదలుపెట్టారు.

Master s Degree in Overacting Pakistan Players Antics Highlighted After India s Dominant Win

సాహిబ్‌జాదా ఫర్హాన్ 'గన్‌షాట్ సెలెబ్రేషన్'
హారిస్ రౌఫ్ ఒక్కడే కాదు, పాకిస్తాన్ బ్యాటర్ సాహిబ్జాదా ఫర్హాన్ కూడా తన హాఫ్ సెంచరీని వివాదాస్పద 'గన్‌షాట్ సెలెబ్రేషన్'తో జరుపుకున్నాడు. పహల్గామ్ దాడిని ఎగతాళి చేయడానికి ఫర్హాన్ ఈ విధంగా సంబరాలు చేసుకున్నాడని చాలామంది భావించారు. అయితే, కొంతమంది అభిమానులు అది అతని సంప్రదాయంలో భాగమని సమర్థించారు. ఈ ఘటనలు పాకిస్తాన్ ఆటగాళ్ల అహంకారపూరిత ప్రవర్తనకు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.

Master s Degree in Overacting Pakistan Players Antics Highlighted After India s Dominant Win

భారత్ చేతిలో పాకిస్తాన్ ఘోర పరాజయం
ఈ వివాదాస్పద సంఘటనల మధ్య, భారత్ పాకిస్తాన్‌ను మరోసారి చిత్తుగా ఓడించింది. పాకిస్తాన్ బ్యాటర్ సాహిబ్జాదా ఫర్హాన్, 58 పరుగులు చేసినప్పటికీ, భారత ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు. శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ మొదటి వికెట్‌కు కేవలం 52 బంతుల్లో 105 పరుగులు జోడించి, 171 పరుగుల లక్ష్యాన్ని సులభంగా ఛేదించారు.

సూర్యకుమార్ యాదవ్ నుంచి కీలక వ్యాఖ్యలు

భారత్ విజయం సాధించిన అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓ కీలక ప్రకటన చేశాడు. క్రికెట్‌లో భారత్-పాకిస్తాన్ రైవలరీని అత్యంత గొప్పగా భావిస్తారు. కానీ ఇప్పుడు రెండు దేశాల మధ్య ఎలాంటి రైవలరీ లేదని సూర్య స్పష్టం చేశాడు. దీనికి గల కారణాన్ని కూడా ఆయన వివరించారు.పాకిస్తాన్‌ను ఓడించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. 'మీరు ఇకపై రైవలరీ గురించి అడగడం ఆపాలి. ఒకవేళ రెండు జట్లు 15-20 మ్యాచ్‌లు ఆడి, స్కోర్ లైన్ 7-7 లేదా 8-7 అయితే దాన్ని మీరు రైవలరీ అంటారు. కానీ స్కోర్ లైన్ 10-1 లేదా 13-0 అయితే, నాకు కరెక్ట్ స్టాట్స్ తెలియదు, కానీ ఇది ఇకపై రైవలరీ కాదు.' అని సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ గాలి తీసినంత పని చేశాడు. ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ క్రికెట్ జట్టు సామర్థ్యాన్ని, వారి నిరాధారమైన అహంకారాన్ని ఎత్తి చూపుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+